ఎంతో సంతోషంగా సాగుతున్న వైవాహిక బంధంలో అక్రమ సంబంధాలు వచ్చి చేరి నిండు సంసారాలను నాశనం చేస్తున్నాయి. ఇలా వీటికి బలైన కొందరు మహిళలు పచ్చటి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి వివాహేతర సంబంధాల్లోనే ఓ మహిళ కూతురు బలికావాల్సి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
స్థానికుల కథనం ప్రకారం.. అది క్రిష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతం. సురేష్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తున్నాడు. ఇలా వీరి వ్యవహారం నడుస్తున్న క్రమంలోనే ఆ మహిళ కూతురుపై కన్నేశాడు సురేష్. దీంతో కొన్నాళ్ల నుంచి ఆ బాలికపై అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు. దీంతో కొన్ని రోజుల తర్వాత ఆ బాలిక గర్బవతి అని తేలడంతో పాటు ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఇది కూడా చదవండి: Mahabubabad: ప్రియుడితో పెళ్ళికి ఒప్పుకోవడం లేదని తండ్రిని చంపేసిన కూతురు!
ఈ విషయం తెలిసిన సదరు బాలిక తల్లి షాక్ కు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.