అన్నదమ్ములు అన్నాక ఆస్తి విషయంలో గొడవలు జరగడం సహజం. కానీ, ఇంతదానికే కొందరైతే హత్యలకు కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ వ్యక్తి.. తన తమ్ముడి చెవిని కోరికాడు.
కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి క్షణికావేశంలో తన సొంత తమ్ముడి చెవిని కొరికాడు. అంతేకాకుండా అదే చెవిని నోట్లో కరకర నములుతూ కాలనీ అంతా తిరిగాడు. ఈ సీన్ చూసి గ్రామస్తులు అంతా షాక్ గురయ్యారు. అనంతరం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలు ఆ వ్యక్తి సొంత తమ్ముడి చెవిని ఎందుకు కొరికాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని సత్రంపాలెం గ్రామం. ఇక్కడే సీతారామయ్య, నరసింహస్వామి అనే అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. అయితే వీరిద్దరికి ఆస్తి విషయంలో గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అదే విషయంపై సోదరులు ఇద్దరూ మరోసారి గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో ఊగిపోయిన అన్న సీతారామయ్య .. తమ్ముడు నరసింహస్వామిపై పైశాచిక దాడికి పాల్పడ్డాడు. కోపంతో తమ్ముడి చెవిని గట్టిగా కొరికాడు.
దీంతో నొప్పితో తమ్ముడు అరిచాడు. అయినా వదలని ఆ దుర్మార్గుడు.. నరసింహస్వామి చెవిని కొరికి పళ్లతో కరకర నమిలాడు. అలాగే కాలనీ అంతా తిరుగుతూ ప్రజలను భయందోళనకు గురి చేశాడు. దీనిని గమనించిన వారి కుటుంబ సభ్యులు వెంటనే నరసింహస్వామిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు సీతారామయ్యను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. క్షణికావేశంలో తమ్ముడి చెవిని కొరికేసిన అన్న పైశాచికంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.