తల్లి, తండ్రి ప్రభుత్వ ఉద్యోగులు. ఇద్దరూ గతంలోనే రిటైర్ అయ్యారు. ఈ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఘనంగాపెళ్లి చేయించి పెద్ద ఇల్లు కట్టించారు. ఇదంతా సరిపోని ఆ దంపతుల కుమారుడు.. పెన్షన్ డబ్బుల కోసం కన్న తల్లిపై దాడి చేసి చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
కనిపెంచిన తల్లిని ప్రేమగా చూసుకోవాల్సిందిపోయి కొందరు కుమారులు దారుణంగా హింసిస్తున్నారు. డబ్బుల కోసం వేధించడం, ఆస్తులు రాయించాలని టార్చర్ పెట్టడం వంటివి చేస్తున్నారు. ఇకపోతే.. తల్లి మంచానికి పరిమితమైతే సవర్యలు చేయాల్సి వస్తుందని కన్న తల్లి అని కూడా చూడకుండా అంతమొందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓ వ్యక్తిని తన భార్యతో చేతులు కలిపి తన తల్లిని దారుణంగా చితకబాదాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని లక్ష్మణరావుపురంలో గ్రామంలో విక్టోరియా-వీరస్వామి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరస్వామి సోషల్ వెల్ఫేర్ ఆఫీసరుగా పని చేయగా, భార్య విక్టోరియా ఉపాధ్యాయురాలిగా పని చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. అయితే ఈ దంపతులు గతంలోనే రిటైర్ అయ్యారు. కొడుకు నటరాజ్ కు గతంలో విద్యాదరి అనే యువతితో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. అలా కొంత కాలం పాటు ఈ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా గడిపారు. ఇకపోతే రాను రాను కుమారుడు నటరాజ్ భార్యతో కలిసి పెన్షన్ డబ్బుల కోసం తల్లి విక్టోరియాను సూటిపోటి మాటలతో వేధించేవారు.
అంతేకాకుండా వృద్ధురాలు అని చూడకుండా కర్రలతో ఇష్టమొచ్చిన కొట్టేవారట. వారి దెబ్బలకు ఆమె చర్మం నల్లగా మారిపోయింది. ఇక రోజు రోజుకు కొడుకు, కోడలు వేధింపులు ఎక్కువవడంతో ఆ వృద్దురాలు తట్టుకోలేకపోయింది. ఇక చేసేదేం లేక కుమారుడు, కోడలిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొడుకు నటరాజ్, కోడలు విద్యాదరిని అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పెన్షన్ డబ్బుల కోసం తల్లిని దారుణంగా కొట్టిన కుమారుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.