విదేశాల్లో భారతీయులకు రక్షణ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఉపాధి కోసమని, చదువుల కోసమని విదేశాలకు వెళ్లే భారతీయులను కొంతమంది విదేశీయులు టార్గెట్ చేస్తున్నారు. దాడులకు, హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన విద్యార్థిని విదేశీయుడు పొట్టన బెట్టుకున్నాడు. ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతూ.. ఫ్రెండ్స్ తో ఆన్ లైన్ కాల్ లో మాట్లాడుతుండగా.. ఒకడు వచ్చి పదునైన ఆయుధంతో పొడిచి చంపాడు. ఆ చావు కేకలు ఆన్ లైన్ కాల్ లో ఉన్న స్నేహితులకి వినిపించాయి. వారికి ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి. మరో పది రోజుల్లో పుట్టినరోజు ఉంది. ఇంతలోనే ఆ విద్యార్ధి హత్యకు గురయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. భారత సంతతికి చెందిన వరుణ్ మనీష్ చడ్డా(20).. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఫర్డ్యూ యూనివర్సిటీలో డేటా సైన్స్ విభాగంలో చదువుతున్నాడు. వరుణ్ తో పాటు కొరియన్ విద్యార్ధి రూమ్ లో ఉంటున్నాడు. మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ తెల్లారేసరికి వరుణ్ శవమై కనిపించాడు. యూనివర్సిటీలోని మెక్ కట్చెన్ హాల్ లో తీవ్రమైన గాయాలతో రక్తపు మడుగుల మధ్య పడి ఉన్నాడు వరుణ్. మృతుడి రూమ్ మేట్ కొరియన్ దేశస్తుడైన ‘జి మిన్ షా’ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరుణ్ మృతి గురించి షానే సమాచారం ఇచ్చాడని పోలీసులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి 12.45 గంటలకు 911 నంబర్ కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడని, అయితే అనుమానంతో జిమ్ మిన్ షాని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
Varun Chheda, a Purdue University student was killed in his dorm room at McCutcheon Hall, police say. His roommate, Gji Min Sha, is in custody. https://t.co/l4ABDNAIiD
— ABC 7 Chicago (@ABC7Chicago) October 6, 2022
అదుపులోకి తీసుకుని విచారించగా షానే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. దక్షిణ కొరియాకి చెందిన షా.. ఇంటర్నేషనల్ స్టూడెంట్, జూనియర్ సైబర్ సెక్యూరిటీ మేజర్ గా పోలీసులు గుర్తించారు. వరుణ్ మృతిపై యూనివర్సిటీ అధ్యక్షుడు మిచ్ డానియల్స్ విచారం వ్యక్తం చేశారు. వరుణ్ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. యూనివర్సిటీ విద్యార్థులు వరుణ్ కి నివాళులు అర్పించారు. వరుణ్ హత్యకు గురైన సంఘటనను అతని బాల్య స్నేహితులు గుర్తు చేసుకున్నారు. మరో 10 రోజుల్లో వరుణ్ 21వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడని, ఇంతలోనే ఇలా జరిగిపోయిందని అన్నారు. ఘటన జరిగే సమయంలో ఆన్ లైన్ కాల్ లో గేమ్స్ ఆడుతూ.. తమతో మాట్లాడుతున్నాడని.. మాట్లాడుతుండగానే వరుణ్ కేకలు వినిపించాయని, అక్కడ ఏం జరుగుతుందో తెలియలేదని, మరుసటి రోజు నిద్రలేచే సరికి వరుణ్ మరణ వార్త తెలిసిందని వరుణ్ స్నేహితుడు అర్నాబ్ సిన్హా వెల్లడించాడు.
What a beautiful, enormous turnout here at Purdue University for a candlelight vigil in honor of Varun Manish Chheda, who lost his life this morning in an on-campus stabbing in his dorm room. @FOX59 @CBS4Indy pic.twitter.com/clTsldIrcZ
— Courtney Spinelli (@CourtSpinelliTV) October 6, 2022
NEW: I talked to a friend of Varun Chheda, the student killed at Purdue. Andrew Wu says Varun was kind, smart and passionate. As for Varun’s roommate, now arrested for his murder, Wu says Varun never said much about him. Live reports coming on @FOX59, @CBS4Indy and @NewsNation. pic.twitter.com/p1hwQYP6wp
— Eric Graves (@ReporterEric) October 5, 2022