ఈ రోజుల్లో కొంతమంది మహిళలు కట్టుకున్న భర్తను కాదని పరాయి సుఖం కొన్ని యుద్దాలే చేస్తున్నారు. సొంత కాపురాన్ని కూల్చేసి ప్రియుడితో ఉండేందుకు పథకాలు రచిస్తున్నారు. ఇక ప్రియుడి మాయలో పడి చివరికి అడ్డొచ్చిన భర్తను సైతం ప్రాణాలతో లేకుండా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భార్య భర్తను దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కోనసీమ జిల్లా కె. గంగవరం మండలం పాలండ్రం. ఇదే గ్రామంలో సుబ్బరావు, వెంకటలక్ష్మీ అనే దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి 2009లో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. దీంతో వీరి కాపురం కొన్నేళ్ల పాటు సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇలా రోజులు మారుతున్న కొద్ది భార్య వెంకటలక్ష్మీ తన రూట్ చేంజ్ చేసి గేర్ మార్చింది. వక్రబుద్దిని చూపించిన వెంకటలక్ష్మీ పక్కింటి పుంటికూర రుచి అమోగం అన్నట్లుగా పక్కింటి యవకుడైన ఉసిరి శ్రీనివాస్ పై మనసుపడింది. అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు ఎంచక్కా వివాహేతర సంబంధాన్ని రంజుగా సాగించారు. అలా వీరి వ్యవహారం నెలల నుంచి సంవత్సరాలకు పరుగెట్టింది.
ఈ క్రమంలోనే వెంకటలక్ష్మీకి భర్త కన్న ప్రియుడు మీదే ఎక్కువ ఇష్టం కలుగుతోంది. అయితే భర్తను లేకుండా చేస్తే.. ఎంచక్కా ప్రియుడితో ఉండొచ్చనే అలోచనలు చేస్తూ ఆ దిశగా పథకం రచించింది. ఇక ఇదే విషయాన్ని ఆ మహిళ ప్రియుడికి చెప్పింది. ఇద్దరు పక్కా ప్లాన్ తో జూన్ 1న రాత్రి భార్య వెంకటలక్ష్మీ భర్తకు మజ్జిగలో విషం కలిపించి తాగించింది. ఇది తాగిన భర్త అదే రాత్రి మరణించాడు. ఇక తెల్లారే సరికి భార్య నా భర్త గుండెపోటుతో మరణించాడు అంటూ ఏడుస్తూ అందరినీ నమ్మించింది. దీంతో అందరూ నిజమే అనుకున్నారు. అలా నాలుగు నెలలు గడిచింది. భర్త చనిపోవడంతో వెంకటలక్ష్మీ ప్రియుడు శ్రీనివాస్ తో తెగ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా గడిపింది.
ఇక సుబ్బరావు మరణంపై అతని తల్లిదండ్రులకు కోడలు వెంకటలక్ష్మీపై అనుమానం కలిగింది. దీంతో అత్తమామలు కోడలిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. కోడలే మా కొడుకును హత్య చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సుబ్బారావు భార్య వెంకటలక్ష్మీని విచారించగా ముందుగా నాకేం తెలియదు అన్నట్లుగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఇక పోలీసులు తమదైన శైలీలో విచారించే సరికి నా ప్రియుడి సాయంతో నేనే హత్య చేసినట్లు వెంకటలక్ష్మీ ఒప్పుకుంది. అసలు విషయం బయటపడడంతో సుబ్బారావు తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం పోలీసులు వెంకటలక్ష్మీతో పాటు ఆమె ప్రియుడు శ్రీనివాస్ ను సైతం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.