అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ ఉద్యోగి గలీజ్ పనులకు శ్రీకారం చుట్టాడు. అందమైన అమ్మాయిలను టార్గెట్ గా చేసుకుని పాడు పనులకు పావులు కదిపాడు. ఈ ఉద్యోగి నీచపు పని బయటకు పొక్కడంతో అమ్మాయిలు, స్థానికులు అందరూ కలిసి దేహశుద్ది చేశారు. ఇక ఇంతటితో ఆగకుండా ఇతగాడి గలీజ్ పనులను పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణమైన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో నివాసం ఉంటున్న ఇతగాడు ఇరిగేషన్ శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే ఈ దుర్మార్గుడు తన పని తాను చేసుకోకుండా గలీజ్ పనులకు శ్రీకారం చుట్టాడు. విషయం ఏంటంటే? క్వార్టర్స్ లో ఉండే అందమైన అమ్మాయిలే టార్గెట్ గా చేసుకున్నాడు. దీంతో తన సెల్ ఫోన్ తో అమ్మాయిలు స్నానం చేస్తుండగా.. వీడియోలు తీశాడు. అలా ఒకరిని కాదు, ఇద్దర్నీ కాదు.., ఏకంగా చాలా మంది అమ్మాయిలు స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసుకున్నాడు.
అయితే ఇటీవల బాత్రూమ్ లో సెల్ ఫోన్ కనిపించడంతో కొందరు అమ్మాయిలు గమనించి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇది పక్కా ఇరిగేషన్ ఉద్యోగి పనేనంటూ తెలుసుకున్నారు. అనంతరం అతడిని పట్టుకుని అందరూ కలిసి దేహశుద్ది చేశారు. దీనిపై స్పందించిన యువతుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచపు పనులు చేస్తున్న దుర్మార్గుడిని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ హెచ్చరించారు. అనంతరం ఈ ఘటనపై అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి అతడిని పట్టించారు. అమ్మాయిల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.