నేటికాలంలో భార్య కళ్లుగప్పి కొందరు భర్తలు పరాయి మహిళతో అక్రమ సంబంధాలకు పదునుబెడుతున్నారు. అలా భార్యను కాదని ఓ భర్త మరో మహిళతో ఇంట్లో ఉండగా కన్న తల్లి కొడుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కోడలికి ఫోన్ చేసింది. తాజాగా కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం పేకేరు శివారు నల్లచెరువుపుంత గ్రామం. శ్రీనివాస్, వీరలక్ష్మి భార్యాభర్తలు. వీరికి పదేళ్ల కిందట వివాహమైంది. కాగా భర్త శ్రీనివాస్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉన్నాడు. అయితే శ్రీనివాస్ డ్రైవర్ కావడంతో అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో నివాసం ఉంటున్న బెల్లం లక్ష్మీ అనే వివాహితతో పరిచేయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త చివరికి వివాహేతర సంబంధంగా రూపు దాల్చింది.
ఇది కూడా చదవండి: Siddipet: పెళ్లైన నెలకే భార్య దారుణం.. ప్రియుడిని దక్కించుకునేందుకు భర్తను హత్య చేసింది!అయితే ఇటీవల శ్రీనివాస్ భార్య పుట్టింటికని వెళ్లింది. దీంతో ఇదే అదునుగా భావించిన శ్రీనివాస్ ఏకంగా ప్రియురాలిని ఇంట్లోకి తెచ్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ తల్లి కొడుకు బండారాన్ని బయటపెట్టింది. వారిద్దరు ఇంట్లో ఉండగా ఇంటికి తాళం వేసి కోడలికి ఫోన్ చేసింది. ఇక వెంటనే పరుగు పరుగున వచ్చిన శ్రీనివాస్ భార్య భర్తతో పాటు అతని ప్రియురాలికి బడితపూజ చేసి బుద్ది వచ్చేలా కొట్టింది. ఇక కొడుకుకి అండగా నిలవాల్సిన తల్లి న్యాయం వైపు నిలబడడంతో అందరూ శ్రీనివాస్ తల్లిని మెచ్చుకుంటున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో శ్రీనివాస్ తల్లిపై తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.