అతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అలా వీరి చీకటి కాపురం విజయవంతంగా 10 ఏళ్లు అలాగే కొనసాగింది. కట్ చేస్తే పదేళ్ల తర్వాత ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఆ మహిళ భర్తతో బాగానే సంసారం చేసింది. అయితే రాను రాను ఆ వివాహిత తన అసలు క్యారెక్టర్ ను బయటకు తీసింది. విషయం ఏంటంటే? ఆ మహిళ స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయంతోనే ఇద్దరూ ఇంకాస్త దగ్గరయ్యారు. రోజూ కలిసి మాట్లాడుకుని చివరికి వివాహేతర సంబంధానికి పావులు కదిపారు. కట్ చేస్తే.. వీరి చీకటి కాపురం 10 ఏళ్లు గడిచింది. ఆ తర్వాత ప్రియుడు చేసిన దారుణం ఏంటంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఇందిరా నగర్ ప్రాంతం. ఇక్కడే పాము లక్ష్మి అనే మహిళ నివాసం ఉండేది. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అలా రోజులు గడుస్తున్న తరుణంలోనే లక్ష్మి వక్రబుద్దిని చూపించింది. ఇకపోతే లక్ష్మి స్థానికంగా ఉండే మీసాల ఏసు అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం రాను రాను ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలా వీరి చీకటి కాపురం 10 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఇన్నేళ్ల కాలంలో లక్ష్మి తన మొగుడికి ఎక్కడా కూడా అనుమానం రాకుండా సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది.
ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి ఏసుకు ప్రియురాలు లక్ష్మిపై అనుమానం పెరిగింది. నాతో కాకుండా మరి కొంతమంది మగాళ్లతో పరిచయాలు పెంచుకుందని రగిలిపోయాడు. ఇదే విషయంపై ఇద్దరూ తరుచు గొడవ పడేవారు. ఇక పక్క ప్లాన్ తో ఏసు ప్రియురాలు లక్ష్మిని చంపాలని అనుకున్నాడు. ఇందు కోసం ఓ ప్లాన్ గీసుకున్నాడు. ఈ నెల 15న ఏసు ప్రియురాలిని నమ్మించి స్థానికంగా ఉన్న ఓ అరటి తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఇద్దరు మరోసారి గొడవ పడ్డారు. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన ఏసు.. ప్రియురాలు లక్ష్మిని దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా లక్ష్మి మృతదేహాన్ని అక్కడే ఉన్న ఓ బావిలో పడేశాడు. అప్పటి నుంచి లక్ష్మి కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అంతటా వెతికారు. కానీ, ఎక్కడా కూడా ఆమె ఆచూకి లభించలేదు.
ఇక చేసేదేం లేక లక్ష్మి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకి కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలోనే లక్ష్మి ఓ నీటి బావిలో తేలిందని స్థానిక పోలీసులకు సమాచారం అందింంది. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్థుల సాయంతో ఆ మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత ఆ శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని అందరూ భావించారు. కానీ, పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం ఆమె ఒంటిపై గాయాలు, దెబ్బలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు.
అనంతరం ఆ దిశగా విచారణ చేపట్టగా ఆమె వివాహేతర సంబంధం బయటపడింది. ఇక పోలీసులు అన్ని కోణాల్లో విచారించే సరికి లక్ష్మిని చంపింది ఎవరో కాదు, ఆమె ప్రియుడు ఏసు అని తెలుసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే సరికి.. ఏసు తన నేరాన్ని అంగీకరించాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నిందితుడు ఏసు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. అనుమానంతో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.