పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు జ్యోతి. ఇటీవల బంధువుల్లో ఒకరిది గృహ ప్రవేశం ఉండడంతో కోనసీమ జిల్లాలోని మలికిపురం వెళ్లింది. చుట్టాలతో కలిసి ఆనందంగా ఆడిపడింది. కానీ, ఉన్నట్టుండి ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో బంధువులంతా షాక్ గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?
తన బంధువుల్లో ఒకతను ఇటీవల నూతనంగా ఓ ఇళ్లును నిర్మించుకున్నాడు. పశ్చిమ గోదావరికి చెందిన జ్యోతి అనే యువతి బంధువులతో కలిసి కోనసీమ జిల్లాలోని మలికిపురం వెళ్లింది. అక్కడ బంధువుల అందరితో కలిసి గృహ ప్రవేశంలో ఆనందంగా గడిపారు. చాలా రోజుల తర్వాత అందరూ కలుసుకోవడంతో సంతోషంగా గడిపారు. అయితే ఈ క్రమంలోనే ఆ యువతి తన చుట్టాలతో కలిసి స్థానికంగా ఉన్న ఓ బీచ్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఆ యువతి.. ఓ 5 ఏళ్ల బాలుడితో కలిసి ముందుకు వెళ్లింది. ఇక అందరూ చూస్తుండగానే ఊహించని ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
బంధువుల కథనం ప్రకారం.. కోనసీమ జిల్లా మలికిపురం పరిధిలోని విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన సాలా ఏసురాజు అనే వ్యక్తి కొత్త ఇల్లును నిర్మించుకున్నాడు. గృహ ప్రవేశానికి రావాలంటూ బంధువులందరికీ చెప్పాడు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకోడేరకు చెందిన బెల్లపుకొండపు జ్యోతి (20) అనే యువతి గురువారం జరిగిన సాలా ఏసురాజు గృహ ప్రవేశానికి హాజరైంది. ఏసురాజుకు జ్యోతి చెల్లి వరుస అవుతుంది. ఇదిలా ఉంటే గృహ ప్రవేశ అనంతరం బంధువులు అందరూ స్థానికంగా ఉన్న అంతర్వేది సాగర సంగం వద్దకు విహార యాత్రకు వెళ్లారు. అందరూ చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో ఆ క్షణాలన్నీ సంతోషంగా గడిపారు.
అయితే ఈ క్రమంలోనే ఏసురాజు కుమారుడైన రాజీవ్ కుమార్ (5) ఎగిసిపడుతున్న అలలను చూసి పరవశించి పోయాడు. దీంతో వెంటనే వాటిని చూస్తూ ముందుకు అడుగులు వేశాడు. ఇక ఆ ఎగిసిపడే అలలకు ఆ బాలుడు కొట్టుకుని పోయాడు. వెంటనే స్పందించిన జ్యోతి.. ఆ బాలుడిని రక్షించే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్లింది. దీంతో ఆమె కూడా అలల దాటికి ఆ బాలుడితో పాటే కొట్టుకుపోయింది. ఇదంతా ఆ బంధువులు కళ్ల ముందే జరిగింది. వారిద్దరూ సముద్రంలో మునిగిపోవడంతో బంధువులు కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఏడ్చారు. కొద్దిసేపటి తర్వాత ఆ యువతి మృతదేహం బయటపడింది. కానీ, ఆ బాలుడి మృతదేహం మాత్రం దొరకలేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆ బాలుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ఇక పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో జ్యోతి, రాజీవ్ కుమర్ తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా ఏడస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.