నేటి కాలంలో కొంతమంది యువత ప్రేమ పేరుతో మోసపోతున్నారు. ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు, ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు క్షణికావేశంతో దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రియుడు ప్రియురాలికి సర్ ఫ్రైజ్ ఇస్తానని చెప్పి దారుణం చేశాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోల్ కతాకు చెందిన ప్రనబ్ దాస్ అనే వ్యక్తి సుష్మిత అనే యువతితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆ పరిచయం కాస్త చివరికి ప్రేమగా మారింది. ఇక కొన్నాళ్లకి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ప్రనబ్ దాస్ తన ప్రియురాలికి చెప్పాడు. కానీ ప్రియురాలు మాత్రం ఇప్పుడు వద్దంటూ డిసెంబర్ లో చేసుకుందామని తెలిపింది. దీంతో ప్రియుడు ప్రియురాలుపై అనుమానం పెంచుకున్నాడు. ఇక మొత్తానికి మే 8న రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకొవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.
ఇది కూడా చదవండి: Bapatla: తల్లి వివాహేతర సంబంధం..‘ఉప్పెన’ సీన్ రిపీట్ చేసిన కుమార్తె!
ఇక గత ఆదివారం తనకు కాబోయే భార్యకు సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పి గర్ఫియా రెసిడేంట్ లోని హోటల్ కు తీసుకెళ్లాడు. ఇక అనంతరం ఆమెపై హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక తల్లిదండ్రులు సుష్మితకు ఫోన్ చేయడంతో స్విఛ్చాఫ్ వచ్చింది. అనుమానమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారించగా ప్రియుడు ఆమెను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. వెంటనే అతనిని అరెస్ట్ రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.