‘‘ కామాం తురానామ్ నభయమ్.. నలజ్జ’’ అని కొంతమందికి కామంతో కళ్లు మూసుకుపోతున్నాయి. ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణ మరిచిపోతున్నారు. చిన్నపిల్లల దగ్గరినుంచి ముసలివాళ్ల వరకు వారి కామ దాహానికి బలవుతున్నారు. మరికొంత మంది అంతకు మించి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. నోరు లేని జీవాలను కూడా వదలటం లేదు. వాటిపై కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారు. మేకలపై, కుక్కలపై, ఆవులపై, గేదెలపై ఇలా చాలా రకాల జంతువులపై కీచకులు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటనలు గతంలో చాలా జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కర్ణాటక, కొడగు, సోమ్రవారపేటె తాలూకా, సుంటికుప్ప సమీపంలోని అందగూవికి చెందిన దేవయ్య అనే వ్యక్తికి ఓ ఆవు ఉంది. అతడు ఆ ఆవును ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. దాన్ని ఇంటికి సమీపంలోనే మిగిలిన రెండు గేదెలతో పాటు కట్టేసి మేత వేస్తుంటాడు. ఈ నేపపథ్యంలో దేవయ్య 27వ తేదీ ఉదయం ఇంటినుంచి బయటకు సంతకు వెళ్లాడు. మధ్యాహ్నం సంత ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆవును కట్టేసి ఉంచిన ప్రాంతంలో ఓ బైకు ఆగి ఉండటం అతడు చూశాడు. దాన్ని చూసిన వెంటనే అతడు ఇంటికి వేగంగా వెళ్లాడు. సామాన్లు అక్కడ ఇంట్లో పెట్టి మళ్లీ బైకు దగ్గరకు వచ్చాడు. దాని దగ్గరినుంచి నేరుగా ఆవు దగ్గరకు వెళ్లాడు. అక్కడి దృశ్యం చూసి అతడు షాక్ తిన్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆవుతో సంభోగం చేస్తూ ఉన్నాడు.
చప్పుడు అవ్వటంతో తిరిగిచూశాడు. వెనకాల దేవయ్య కనిపించాడు. దీంతో అక్కడినుంచి పరిగెత్తడానికి ప్రయత్నించాడు. అయితే, దేవయ్య అతడ్ని పట్టుకున్నాడు. అతడ్ని ఏం చేస్తున్నావని అడగ్గా.. అసలు విషయం చెప్పాడు. దీంతో దేవయ్య అతడ్ని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు అతడ్ని మందిలించి వదిలేశారు. ఈ నేపథ్యంలోనే సదరు ఆవు ఓ దూడకు జన్మనిచ్చింది. అయితే, ఆ ఆవు దూడ పుట్టిన వెంటనే చనిపోయింది. దీంతో దేవయ్యకు కోపం వచ్చింది. సదరు కామాంధుడు గర్భంతో ఉన్న ఆవుతో ఆ పని చేయటం వల్లే ఆవు దూడ చనిపోయిందని భావించాడు. పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని బుధవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.