knife dance : హోళీ పండుగ రోజు పెను విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు ఎంతో సరదాగా తన డ్యాన్స్‌తో అందర్నీ సంతోషపరుస్తున్న అతను కత్తితో గుండెల్లో పొడుచుకోవటంతో అక్కడి వారు షాక్ అయ్యారు. వాళ్లు తేరుకునే లోపు అతడు కుప్పకూలాడు. అతడ్ని బ్రతికించటానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. పోరపాటు కారణంగా నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, బన్‌గంగ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో హోళీ రోజును పురస్కరించుకుని హోళిక దహన్ కార్యక్రమం జరిగింది. ఆట పాటలతో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. 38 ఏళ్ల గోపాల్ డ్యాన్స్ చేస్తూ అందర్నీ సంతోషపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ కత్తి తీసుకుని స్టేజిమీదకు ఎక్కాడు. కత్తి పట్టుకుని ఫీట్లు చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు.
కొద్దిసేపటి తర్వాత పొరపాటున కత్తిని గుండెల్లో పొడుచుకున్నాడు. కత్తి లోతుగా గుండెల్లో దిగబడింది. ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ హఠాత్పరిణామానికి అతడి డ్యాన్స్ చూస్తూ ఉన్న కటుంబసభ్యులు, బంధువులు షాక్ అయ్యారు. గుండెలనుంచి రక్తం కారుతున్న గోవింద్‌ను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయినా లాభం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ అతడు మృత్యవాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో గోవింద్ మందు తాగి ఉన్నాడని, కార్యక్రమంలో పాల్గొన్న అందరు యువకులు మందు తాగి ఉన్నారని విచారణలో తేలింది. గోవింద్‌కు పెళ్లై ఓ కుమారుడు కూడా ఉన్నాడని తెలిపారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#MadhyaPradesh A man succumbed to injuries in #Indore, he was dancing with a knife in his hand during holi celebrations stabbed himself, he was taken to a hospital where the doctors declared him dead@Anurag_Dwary Video pic.twitter.com/KdLv2nOHM5
— Siraj Noorani (@sirajnoorani) March 19, 2022
ఇవి కూడా చదవండి : ప్రైవేట్ బస్సు బోల్తా.. 8 మంది మృతి
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.