ఓ యువతిని అర్థరాత్రి కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఇక తండ్రి కూతురును కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో దుండగులు ఆ యువతిని తీసుకెళ్లిపోయారు. తాజాగా ఈ కిడ్నాప్ కు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు అర్థరాత్రి ఆ యువతని ఆ దుండుగుల ఎందుకు కిడ్నాప్ చేశారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం మూడవపల్లి గ్రామం. ఇక్కడే శాలినీ అనే యువతి తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటుంది. అయితే ఇటీవల ఆ యువతి పూజ ముగించుకుని తన ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలోనే నలుగురు యువకులు కారులో వచ్చి ఆ యువతి కోసం చూస్తున్నారు. ఇక ఆ యువతి రాకను గమనించిన ఆ దుండుగుల తండ్రి ముందే అతని కూతురును కారులో బలవంతంగా ఎక్కించారు. దీనిని గమనించిన తండ్రి ఆ దుండగుల నుంచి తన కూతురుని రక్షించే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోవడంతో ఆ దండగులు ఆ యువతి తండ్రిపై దాడి చేసి ఆ యువతిని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
ఇదంతా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఆ యువతి తండ్రికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. కిడ్నాప్ చేసిన యువకుడు ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ దండుగులు ఆ యువతిని కిడ్నాప్ చేయడానికి కారణం ఏంటి? ఏమైన ప్రేమ వ్యవహారం దాగి ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.