గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు బాలికలు ఉన్నట్టుండి కనిపించకుండపోయారు. ఈ విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిల పేర్లు జి. అశ్రిత (17), సీ.హెచ్. నిషిధ )(17). ఖమ్మం జిల్లా కల్లూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. అయితే ఎంఈసీ చదువుతున్న ఈ బాలికలు రోజూ కాలేజీకి వెళ్తూ హాస్టల్లో ఉండేవారు. ఇదిలా ఉంటే శనివారం ఉన్నట్టుండి అశ్రిత, నిషిధ ఇద్దరూ కనిపించకుండపోయారు. దీంతో హాస్టల్ సిబ్బంది వీరి ఆచూకి కోసం పరిసర ప్రాంతాల్లో వెతికారు. కానీ, ఆ అమ్మాయిల ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక హాస్టల్ సిబ్బంది ఆ బాలికల తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ బాలికల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనంతరం విద్యార్థుల మిస్సింగ్ పై హాస్టల్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఉన్నట్టుండి అశ్రిత, నిషిధ ఇద్దరూ కనిపించకుండపోవడంతో.. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కంటతడి పెడుతున్నారు. అయితే వీరి ఆచూకి తెలిసిన వారు 871265911 నెంబర్ కాల్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.