కొందరు పైకి ఏం తెలియనట్టు కనిపిస్తూ లోలోపల చేసే పనులన్నీ చేసేస్తుంటారు. ఇక బయట జనాలకి మాత్రం నమ్మించేందుకు చిన్న అనుమానం కూడా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ చివరికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడతారు. అచ్చం ఇలాగే చేయబోయిన ఓ తెలివైన మహిళ దొంగతనానికి పాల్పడి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి తెల్లమొహమేసింది. తాజాగా ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలేం జరిగిందంటే? ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామానికి వీరమ్మ అనే మహిళ చింతకాని మండలం రామకృష్ణాపురంలోని ఉన్న తన కుమార్తె దగ్గర ఉంటోంది.
అయితే ఈ మహిళ కూతురి వద్ద ఉండి సేవలు చేయకుండా ఏకంగా దొంగతనాలు చేసేందుకు మాస్టార్ ప్లాన్లు గీసింది. అంతుచిక్కకుండా తెలివిగా దోచుకుంటూ ఖిలాడీ లేడిగా పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఖమ్మం నగరంలోని రుద్రమకోటలో పసుపులేటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ మహిళ బంధువుని అంటూ ఇంట్లోకి వెళ్లింది. నిజమేనేమోనని స్థానికులు నమ్మారు. ఇక ఇంటి యజమాని శ్రీనివాస్ ఆయన భార్య భవానీ పొలానికి వెళ్తూ ఇంటి తాళం కిటికీ పక్కనున్న గోడకు తగిలించి వెళ్లారు.
ఇది కూడా చదవండి: Vijayawada: తన కోరికను భర్త నెరవేర్చడం లేదు అనుకుంది.. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా!
ఎట్టకేలకు సొమ్ము దొంగలించి పారిపోతున్న వీరమ్మను శ్రీనివాస్ పట్టుకుని చెట్టుకు కట్టేశాడు. ఇక చుట్టు పక్కలవారంతా వచ్చి ఇంతటి నీచానికి పాల్పడతావా అంటూ చితకబాదారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వీరమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.