ఖమ్మం జిల్లాలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ మహిళ వంట నూనే అనుకుని పురుగుల మందుతో వంట చేసింది. ఇది తిన్న ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది. పూర్తి వివారాల్లోకి వెళ్తే.. జిల్లాలోని తిరుమలామపాలెంలోని మేడిదపల్లిలో బండ్ల నాగమ్మ, పుల్లయ్య భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరగగ పల్లవి అనే కూతురు కూడా ఉంది.
అయితే గత కొంత కాలం నుంచి నాగమ్మ మతిస్థిమితం లేక ఇబ్బంది పడుతోంది. గురువారం నాగమ్మ వంట చేసే క్రమంలో మంచి నూనే అనుకుని పురుగుల మందుతో వంట వండింది. వండిన వంటను పొలానికి తీసుకెళ్లి తాను తినడమే కాకుండా భర్త పుల్లయ్యకు, కూతురు పల్లవికి కూడా వడ్డించింది. అయితే కొద్దిగా తిన్న తర్వాత వారికి మందు వాసన రావడంతో పడేశారు. కొంతసేపటి తర్వాత ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆస్పత్రిలో చికిత్స పొందిన నాగమ్మ మరణించగా భర్త, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వంట నూనే అనుకుని పురుగుల మందుతో వంట చేసిన ఈ అంశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.