భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. కానీ, ఇంతదానికి కొందరు దంపతులు హద్దులు దాటి దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ భర్త మద్యం మత్తులో భార్యను రోకలి బండతో కొట్టి చంపాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త కట్టుకున్న భార్యను అని చూడకుండా రోకలి బండతో కొట్టి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగిందంటే? ఖమ్మం జిల్లా పట్టణంలోని ఓ ప్రాంతంలో దేవమణి-రాంబాబు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహ జరిగింది. భర్త ఆటో డ్రైవర్ గా పని చేస్తుండగా, భార్య మాత్రం ఖమ్మం ఆర్టీసీ డీపో కండక్టర్ గా పని చేస్తున్నారు.
వీరికి ఓ కుమార్తె, కుమారుడు సంతానం. భార్యాభర్తలు ఇద్దరూ పని చూసుకుంటు సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడ్డారు. భర్త మద్యం మత్తులో ఉండడంతో ఈ గొడవ మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన భర్త రాంబాబు.. రోకలి బండతో భార్య దేవమణిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆ మహిళ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వెంటనే గమనించిన స్థానికుల పోలీసులు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. తల్లి మరణించడంతో కుమారుడు, కుమార్తె శోక సంద్రంలో మునిగిపోయారు. మద్యం మత్తులో భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.