ఆ మహిళ ఈవెంట్లకు వెళ్తుండేది. అలా వచ్చిన డబ్బులతో సంసారాన్ని ఈడ్చుకొచ్చేది. భర్త మద్యానికి బానిసై డబ్బు కోసం భార్య షాకీరా టార్చర్ పెట్టినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా..!
ఆమె పేరు షేక్ షాకీరా బేగం. గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఇక కొంత కాలానికి వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అలా వారి జీవితం ఎంతో సంతోషంగా సాగుతూ ఉండేది. అయితే భార్య మెహందీ ఈవెంట్లకు వెళ్తుండేది. అలా వచ్చిన డబ్బులతో సంసారాన్ని ఈడ్చుకొచ్చేది. అయితే భర్త మాత్రం తాగుడుకు బానిసై సంసారాన్ని పట్టించుకునేవాడు కాదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఆ వివాహిత భర్త డబ్బు కోసం చివరికి ఎంత దారుణానికి వడిగట్టాడో తెలుసా?
పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని కాకార్లపల్లి ప్రాంతం. ఇక్కడే ముజీబ్-షేక్ షాకీరా బేగం (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. భర్త స్థానికంగా కార్ మెకానిక్ గా పని చేస్తుండగా, భార్య మెహందీ ఈవెంట్లకు వెళ్తుండేది. అలా దంపతులు ఎంతో కొంత సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే రాను రాను ముజీబ్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే డబ్బు కోసం భార్య షాకీరా బేగంను తరుచు వేధిస్తుండేవాడు. ఆదివారం రాత్రి కూడా భర్త ముజీబ్ డబ్బు ఇవ్వాలంటూ భార్యను టార్చర్ పెట్టినట్లు తెలుస్తుంది.
దీంతో భర్త భార్యాభర్తలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక భర్త తన ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లాడు. భర్త తీరుతో విసుగు చెందిన భార్య షాకీరా బేగం తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇలాంటి బతుకు నాకొద్దు అనుకుందో ఏమో కానీ, షాకీరా బేగం వెంటనే భర్తకు ఫోన్ చేసి.. నేను వెళ్లిపోతున్నా.. మీరు ముగ్గురు సంతోషంగా ఉండండి అంటూ ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత షాకీరా బేగం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వెంటనే ఇంటికి వచ్చి చూడగా.. భార్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.