తెలుగు రాష్ట్రాల్లోని కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పాడుపనుల ముసుగులో కొంతమంది మైనర్ బాలికలను సైతం ఇందులోకి లాక్కొస్తున్నారు. అయితే ఖమ్మం కల్లూరు పరిధిలోని శ్రీరాంపురంలో ఓ మహిళ ఓ ఇల్లును అద్దెకు తీసుకుని గత కొంత కాలం నుంచి వ్యభిచారం నిర్వహిస్తుంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం గ్రామానికి చెందిన మహిళ ఇలాంటి పాడుపనులు చేస్తుందని కొందరు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికులు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన మంగళవారం అర్థరాత్రి ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం కాపు కాపుకాచిన పోలీసులు ఆ మహిళ ఉంటున్న అద్దె ఇంట్లో ప్రవేశించి దాడులు చేశారు. పోలీసుల దాడుల్లో భాగంగా కొందరు మహిళలతో పాటు మరి కొంతమంది విటులు పట్టుబడ్డారు. ఇక వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.