ప్రేమ.. రెండక్షరాల ఈ పదం చేసే మాయ అంతా ఇంతా కాదు. ప్రేమకు దైవాన్ని మించిన శక్తి ఉంది అంటారు. అవును మరి చరిత్రలో ప్రేమ కోసం జరిగిన యుద్ధాలు, కూలిన సామ్రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. ఎందరో అమర ప్రేమికులు చరిత్రలో నిలిచిపోయారు. ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. గతంలో కన్నా కూడా ప్రస్తుతం సమాజంలో ప్రేమ వివాహాలు పెరిగిపోయాయి. మానసకి పరిపక్వత వచ్చి.. జీవితంలో స్థిరపడిన తర్వాత ప్రేమ వివాహం చేసుకుంటే ఎవరు పెద్దగా అడ్డు చెప్పరు. అలా కాకుండా తెలిసి తెలియని వయసులో చిగురించే ప్రేమలు విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వావివరసలు మరిచి మరీ ప్రేమించుకుంటున్నారు. ఇదేం పిచ్చో అర్థం కావడం లేదు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఇద్దరు యువతీయువకులు ప్రేమ వివాహం చేసుకున్నారు. తీరా పెళ్లి అయ్యాక.. వారిద్దరు అన్నా చెల్లెళ్లు అవుతారని తెలిసింది. దాంతో దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: బాలుడిపై ఎయిడ్స్ సోకిన మహిళ లైంగిక దాడి.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు!
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన యువకుడు(24), యువతి (21) ఇద్దరు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ శివారులో ఎవరికి తెలియకుండా వివాహం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయి.. సైలెంట్‌గా ఉన్నారు. మరి ఎలా జరిగిందో.. ఎవరో చేశారో తెలియదు కానీ.. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా గ్రూపుల్లో దర్శనం ఇచ్చాయి. వీటిని చూసిన బంధువులు.. వారికి ఫోన్ చేసి.. మీరిద్దరు వరసకు అన్నాచెళ్లెల్లు అవుతారు. అలా ఎలా పెళ్లి చేసుకున్నారు అని చివాట్లు పెట్టారు. విషయం ఇద్దరి ఇళ్లల్లో విషయం తెలియడంతో.. వారిని మందలించారు. ఇలా చేశారేంటని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: భార్యను తోపుడు బండిలో ఆస్పత్రికి తీసుకెళ్లిన వృద్ధుడు.. ఘటనపై సీఎం సీరియస్!
దీంతో మనస్తాపానికి గురైన యువతి మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న యువకుడు కూడా పురుగుల మందుతాగి ఓ వ్యవసాయ బావిలో దూకాడు. అది గమనించిన స్ధానికులు యువకుడిని వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్ధితి విషమించటంతో అక్కడినుంచి హైదరాబాద్ తరలించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఏపీలో కరెంటు కోతల కలవరం.. ప్రభుత్వ ఆస్పత్రిలో నరకం చూసిన శిశువులు, బాలింతలు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.