తెలుగు రాష్ట్రాల్లో అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగూతూ వస్తుంది. ప్రియురాలి కోసమే తన స్నేహితుడిని హత్య చేసినట్లు నింధితుడు హరిహరకృష్ణ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నవీన్ హత్యకేసులో ప్రధాన నింధితుడు హరిహరకృష్ణ ప్రియురాలు, అతని స్నేహితుడు హసన్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఇక నవీన్ హత్య కేసు విషయంలో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో హరిహరకృష్ణ ప్రియురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ ని హరిహరకృష్ణ కిరాతకంగా హత్య చేసిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపింది. తాజాగా ఈ కేసు అనూహ్యంగా కొత్త మలుపు తిరిగింది. తన ప్రియురాలి కోసం హత్యచేసినట్లు పోలీసుల ముందు నింధితుడు హరిహరకృష్ణ ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో అతని ప్రియురాలు నిహారిక, స్నేహితుడు హసన్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ కేసులో ఈ కేసులో ఏ1 హరిహరకృష్ణ, ఏ2 గా హసన్, ఏ3 గా నిహారిక పేర్లు చేర్చారు. గత నెల 17 న జరిగిన నవీన్ హత్య కేసు వివరాలను ఎల్ బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. నవీన్ హత్య విషయం నిహారిక, హసన్ కి తెలిసినప్పటికీ పోలీసులకు తెలియపర్చనందుకు వీరిద్దరినీ నింధితుల లీస్ట్ లోకి చేర్చినట్లు డీసీపీ తెలిపారు.
గత నెల 17 న హరిహరకృష్ణ తన స్నేహితుడు అయిన నవీన్ ని హతమార్చి అక్కడ నుంచి తన మిత్రుడు హాసన్ రూమ్ కి వెళ్లాడు. రక్తపు మరకలు ఉన్న దుస్తులను వాష్ చేసుకున్నాడు. నవీన్ ని హత్య చేసినట్లు తెలిపాడు. మరుసటి రోజు అక్కడ నుంచి పరారీలో ఉంటూ 20వ తేదీన తన ప్రియురాలు నిహారికను కలిశాడు. తన ప్రియురాలికి నవీన్ ని హత్య చేసిన స్థలాన్ని చూపించాడు. ఆ తర్వాత బైక్ పై వెళ్లి ఇద్దరు కలిసి రెస్టార్ రెంట్ లో భోజనం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. నవీన్ హత్య విషయం హరిహరకృష్ణ ప్రియురాలికి, స్నేహితుడు హసన్ కి తెలిసినా బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ కారణంగానే పోలీసులు వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హరిహరకృష్ణ పియురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కి తరలిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.