అప్సర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, అప్సర మృతదేహానికి వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం ఆ రిపోర్టు ను వైద్యులు పోలీసులకు అప్పగించారు.
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన అప్సర హత్య కేసు ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతోంది. ఈ కేసులో నిందితుడైన పూజారి సాయికృష్ణకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకి తరలించారు. ఇకపోతే, అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అప్సర పోస్ట్ మార్టం రిపోర్టును వైద్యులు తాజాగా పోలీసులకు అందించారు. అయితే, ఈ రిపోర్టులో మాత్రం కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఇంతకి ఆ పోస్ట్ మార్టం రిపోర్టులో ఏం తేలింది. వైద్యులు ఏమన్నారంటే
అప్సర మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ ను సైతం వైద్యులు తాజాగా పోలీసులకు అప్పగించారు. కాగా, ఆ రిపోర్ట్ లో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. నిందితుడు సాయికృష్ణ అప్సర తలపై బలంగా బాదాడు. దీంతో ఆమె తలకు బలమైన గాయమైనట్లు వైద్యులు ప్రకటించారు. దీని కారణంగానే అప్సర ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత అప్సర డెడ్ బాడీని పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.