కుమారుడు ఏడుస్తుంటే తండ్రి ఎత్తుకుని ఓదారుస్తున్నాడు. ఈ క్రమంలోనే కొడుకు తండ్రిపై మూత్రం పోశాడు. దీంతో తండ్రికి ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చి ఆ బాబుపై దాడి చేశాడు. ఇంతటితో ఆగకుండా భార్యపై కూడా దాడికి దిగాడు. ఈ క్రమంలోనే భార్య ఊహించని నిర్ణయం తీసుకుంది.
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. కానీ, కొంతమంది దంపతులు గోరుతో పోయేదాన్ని చివరికి గొడ్డలి దాక తెచ్చుకుంటుంటారు. ఇక ఇంతటితో ఆగక.. క్షణికావేశంలో ఊహించని దారుణాలకు పాల్పడుతుంటారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ వ్యక్తి.. కన్న కొడుకుపై దాడి చేశాడు. ఇదే విషయంపై భార్య భర్తతో గొడవకు దిగింది. ఇదే గొడవ చివరికి చినికి చినికి గాలి వానలా మారడంతో భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
అది కేరళలోని వెట్టిచీర గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. సఫానా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా కాపురాన్ని నెట్టుకొచ్చారు. ఇక కొంత కాలం తర్వాత వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టడంతో ఆ భార్యాభర్తలు ఎంతో సంబరపడ్డారు. ఇదిలా ఉంటే.. ఇటీవల తన కుమారుడు ఏడుస్తుంటే తండ్రి ఎత్తుకుని ఓదారుస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని కొడుకు అతనిపై మూత్రం పోశాడు. దీంతో తండ్రికి ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది.
క్షణికావేశంలో ఆ తండ్రి తన కుమారుడిపై దాడి చేశాడు. అక్కడే సఫానా.. ఎందుకు కొట్టావంటూ భర్తతో గొడవకు దిగింది. దీంతో ఇదే విషయమై భార్యాభర్తలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే సఫానా భర్తపై అలిగి ఆ తర్వాత తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక భర్త తీరుతో విసుగు చెందిన సఫానా.. గత శనివారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇక వెంటనే గమనించిన స్థానికులు.. సఫానాను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ ఆ మహిళ ఈ శనివారం ప్రాణాలు విడిచింది.
అయితే సఫానా మరణించడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తమామలు, భర్త వేధింపులకు కారణంగానే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని, సఫానా భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో తెలిపింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.