Crime News: ఆస్తి కోసం ఓ కూతురు అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. కన్న తల్లికి ఎలుకల మందుపెట్టి చంపింది. అంతటితో ఆగకుండా తండ్రిని కూడా చంపాలని చూసింది. అయితే, తండ్రి అదృష్టం బాగుండి బతికిపోయాడు. ఈ సంఘటన కేరళలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళ, త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఇందులేఖ అనే మహిళ భర్త విదేశాల్లో ఉన్నాడు. అతడు విపరీతంగా అప్పులు చేయటంతో గత కొన్ని నెలల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మరికొన్ని రోజుల్లో ఇండియాకు వచ్చేస్తానని ఇందులేఖకు చెప్పాడు. భర్త చేసిన అప్పుల గురించి ఆలోచించిన ఇందులేఖ ఓ నిర్ణయానికి వచ్చింది. ఎలాగైనా తల్లిదండ్రుల్ని చంపి, ఆస్తిని తన సొంతం చేసుకోవాలనుకుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఎలుకల మందు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి గూగుల్ సెర్చ్ చేసింది.
ఎలుకల మందుతో జనం చనిపోతారని ధ్రువీకరించుకుంది. వెంటనే తల్లి, తండ్రికి టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. ఆ టీని తల్లి తాగింది. కానీ, తండ్రి చేదుగా ఉందని వదిలేశాడు. ఎలుకల మందు కలిపిన టీ కావటంతో తల్లి ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. డాక్టర్లకు అనుమానం వచ్చి, పోస్టుమార్టం నిర్వహించారు. విష ప్రభావంతో ఆమె చనిపోయిందని తేల్చారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులేఖను విచారించగా అసలు విషయం బయటపడింది. ఆస్తికోసం దారుణానికి ఒడిగట్టినట్లు ఇందులేఖ తెలిపింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భర్తను చంపి బిర్యానీ వండుకుని తిన్న భార్య! కారణం ఏంటంటే..