సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతుంది. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. ప్రయోజనం లేకుండా పోతుంది. అకృత్యాలకు పాల్పడటం.. ఆ దారుణాన్ని వీడియోలు, ఫోటోలు తీసి.. బాధితులను బెదిరించి.. చివరకు వారు ప్రాణాలు తీసుకునే స్టేజ్‌కు తీసుకెళ్లేవరకు ఆగడం లేదు. ఇది కాక.. గ్రాఫిక్స్ సాయంతో ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. సెలబ్రిట్రీలను సైతం ఇలా బెదిరించాలని చూసే కేటుగాళ్లు.. రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఉదంతం కేరళలో వెలుగులోకి వచ్చింది. ఓ కేటుగాడు ఏకంగా కేరళ ఆరోగ్య మంత్రి పేరిట నకిలీ అశ్లీల వీడియోను తయారు చేయాలనుకుని.. పోలీసులుకు దొరికిపోయాడు. ఆ వివరాలు..
టీపీ నందకుమార్.. ఈ పేరు మనకు పెద్దగా పరిచయం లేదు కానీ.. కేరళ జనాలు మాత్రం ఇతగాడిని టక్కున గుర్తు పడతారు. క్రైమ్ వార్తల మీద సంచలనాత్మక కథనాలతో పాటు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరిట ఇబ్బందికరమైన కంటెంట్‌ను ఇస్తుంటాడు. క్రైమ్ మాగ్జైన్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా సహా ఉద్యోగిణిని వేధించిన కేసులో కొచ్చి పోలీసులు అతడిని కాలూర్‌లో అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Whatsappలో ఫాదర్స్ డే మెసేజెస్ క్లిక్ చేస్తున్నారా? బుక్కైపోతారు జాగ్రత్త!
క్రైమ్ మ్యాగ్జైన్ చీఫ్ ఎడిటర్ అయిన టీపీ నందకుమార్.. తన దగ్గర పనిచేసిన ఓ ఉద్యోగిణి లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు డబ్బు ఆశ చూపి తనను నీలిచిత్రంలో నటించాలని ఒత్తిడి చేశాడని భాదితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ (Veena George)లా ఉన్నావని, నీలిచిత్రంలో నటించమని, ఆ వీడియో ద్వారా మంత్రి పరువు తీయోచ్చని నందకుమార్ ప్లాన్ వేసినట్లు ఆమె తెలిపింది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: విషం పెట్టి భర్తను చంపిన భార్య! కారణం ఏంటంటే?
ఒకవేళ నీలిచిత్రంలో గనుక నటించకపోతే.. తనపై మార్ఫింగ్ కంటెంట్ చేసి ఇంటర్నెట్‌లో వదులుతానని బెదిరించాడని, అయినా ఒప్పుకోకపోవడంతో కులం పేరుతో దూషించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన దగ్గర మంత్రి నగ్న వీడియోలు ఉన్నాయంటూ నందకుమార్ గతంలోనే ఓ కథనం ప్రచురించాడు. ఈ నేపథ్యంలోనే తనపై అశ్లీల వీడియోలో నటించాలని బెదిరించాడని ఆమె మీడియాకు వివరించింది. ఇక బాధితురాలితో పాటు ప్రస్తుతం క్రైమ్ మ్యాగ్జైన్‌లో పని చేస్తున్న మరికొందరు ఉద్యోగులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేయడం గమనార్హం. దీంతో నందకుమార్‌పై ఐపీసీలోని సెక్షన్‌లతో పాటు ఎస్సీఎస్టీ యాక్ట్, ఐటీ యాక్ట్‌ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Constable: కుజ దోషం ఉందని పెళ్లికి నో చెప్పిన ప్రియుడు! ఈ కానిస్టేబుల్ ఏం చేసిందంటే?