మనిషి ఇప్పటి వరకు ఎన్నో రంగాల్లో అభివృద్ది సాధించాడు. భూమీ, ఆకాశం, సముద్రం అన్నింటా తన ఆదిపత్యాన్ని చాటుకుంటున్నాడు. ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ది సాధించింది. అంతరిక్షంలో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు.. వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే.. ఇప్పికీ కొన్ని చోట్ల దెయ్యాలూ.. భూతాలు ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు.
క్షుద్ర పూజలు చేస్తే తాము కోరుకున్నది సిద్దిస్తుందని నమ్మే అంధవిశ్వాసులు ఉన్నారు. క్షుద్ర పూజలు చేస్తే.. నర బలులు ఇస్తే ఆకస్మిక ధన లాభం ఉంటుంది ఉంటుందని దొంగ బాబాలు చెబితే మూర్ఖంగా చేసేవారు ఉన్నారు. నరబలి ఇస్తే తమకు ఆర్థికంగా కలిసి వస్తుందని ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చిన ఘటన కేరళాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..
కేరళాకు చెందిన భగవంత్ సింగ్, లైలా దంపతులు ఇటీవల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వీరికి మమ్మద్ షఫీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొంత కాలం వీరి కుటుంబ పరిస్థితులను గమనించిన మహ్మద్ షఫీ ఇటీవల ఒక స్వామీజీని కలవగా ఆర్థిక కష్టాలు తొలగి పోవాలంటే ఎవరినైనా నరబలి ఇవ్వాలని సలహా ఇచ్చాడు. ఈ విషయం భగవంత్ సింగ్, లైలా తెలిపాడు. ఈ క్రమంలోనే మహ్మద్ షఫికి ఇద్దరు మహిళలతో పరిచయం ఏర్పడింది.
ఇటీవల వారిద్దరికీ మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకు వెళ్లాడు. అప్పటికే అక్కడ భగవంత్ సింగ్, లైలా దంపతులతో బలి కోసం ముగ్గు వేసి రెడీగా ఉన్నారు. వారితో కలిసి మహ్మద్ షఫీ ఆ ఇద్దరు మహిళను బలి ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మహిళలను హత్య చేసినందుకు ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతి చెందిన మహిళలు పద్మం, రోస్లీగా గుర్తించారు పోలీసులు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది చదవండి : ప్రమోన్మాది ఘాతుకం.. ప్రేమకు అంగీకరించలేదని యువతి హత్య!