ఆమెకు పెళ్లై ఓ కుమారుడు ఉన్నాడు. గత 28 రోజుల కిందట మరో బిడ్డ జన్మించింది. దీంతో ఆ మహిళతో పాటు ఆమె కుటంబ సభ్యులు అంతా సంతోషపడ్డారు. కానీ, ఉన్నట్టుండి జరిగిన ఓ ఘటనతో ఆ మహిళ ఊహించిన నిర్ణయం తీసుకుంది.
ఆమెకు గతంలో పెళ్లై 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల మరో పాప కూడా జన్మించింది. దీంతో భార్యాభర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులు అందరూ సంతోషపడ్డారు. అలా 28 రోజులు గడిచింది. అయితే ఇటీవల ఆమె కటుంబ సభ్యులు అందరూ చర్చికి వెళ్లారు. చిన్నారి ఎడ్వడంతో ఎప్పటిలాగే ఆ మహిళ పాలు ఇచ్చింది. కానీ, ఆమె చేసిన పనికి తన పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కట్ చేస్తే ఆ మహిళ ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. అది కేరళలోని ఇడుక్కి జిల్లా ఉప్పుతర ప్రాంతం. ఇక్కడే లిజా టామ్ (38) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొన్నేళ్ల తర్వాత ఆమెకు ఓ కుమారుడు (7) జన్మించాడు. పుట్టిన కుమారుడుని చూసుకుంటూ ఆ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే లిజా టామ్ ఇటీవల మరో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ దంపతుల ఆనందాలకు హద్దులు లేకుండాపోయాయి.
ఇకపోతే ఇటీవల లిజా టామ్ కుటుంబ సభ్యులు అంతా చర్చికి వెళ్లారు. తన ఇద్దరి బిడ్డలతో ఆ మహిళ ఇంట్లో ఉంది. అయితే తన పసిబిడ్డ ఏడ్వడంతో ఆ మహిళ పాలు ఇచ్చింది. ఇక గొంతులో పాలు ఇరుక్కుని తన పసిబిడ్డ మరణించింది. తన బిడ్డ చనిపోయాడని తెలుసుకున్న ఆ మహిళ.. ఒక్కసారి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో అర్థం కాక.. తన పెద్ద కుమారుడిని తీసుకుని స్థానికంగా ఉన్న ఓ నీటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త, ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తల్లీ, కుమారుడి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పుట్టిన బిడ్డ 28 రోజులకే చనిపోవడంతో తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.