పైన ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరి పేర్లు షిజు, సూర్య ఎస్. నాయర్. పనిచేసే చోట వీరిద్దరికి పరిచయం ఉండడంతో వీరి పరిచయం చివరికి ప్రేమగా మారింది. దీంతో కొన్నాళ్లపాటు ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. కలిసి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కట్ చేస్తే ప్రియురాలు ప్రియుడితో పెళ్లికి నిరాకరించి మరో యువకుడితో పెళ్లికి రెడీ అయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అనంతరం ప్రియుడు సైతం తాజాగా ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఈ లవ్ స్టోరీలో ఏం జరిగిందనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది కేరళలోని వెంజరమూట్ పరిధిలోని కేఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం. ఇక్కడే శసింద్రన్, సుషిల దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సూర్య ఎస్. నాయర్ (23) అనే కూతురు ఉంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో బాగా రాణించిన సూర్య నాయర్ సెయింట్ జాన్స్ మెడికల్ విలేజ్ కాలేజ్ నర్సుగా పని చేసింది. ఈ క్రమంలోనే నాయర్ కు షిజు (32) అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరి పరిచయ రాను రాను ప్రేమగా మారడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. అలా వీరి ప్రేమాయణం నెలల నుంచి ఏడాది గడిచింది. పీకల్లోతు ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక కొన్నాళ్లకి ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.
కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., కొన్ని రోజుల తర్వాత నాయర్ ప్రియుడు షిజుతో పెళ్లికి నిరాకరించింది. ఇక ఇంతటితో ఆగకుండా ప్రియుడిని కాకుండా మరో యువకుడితో పెళ్లికి రెడీ అయింది. ఈ విషయం తెలుసుకున్న షిజు తీవ్ర కోపంతో ఊగిపోయాడు. ఎలాగైన ప్రియురాలిని హత్య చేయాలని అనుకున్నాడు. ఇక అనుకున్నదే ఆలస్యం.. షిజు 2016 జనవరి 17న ఉదయం ఇంట్లో ఉన్న నాయర్ వద్దకు వెళ్లాడు. ఇక వెళ్తూ వెళ్తూనే ప్రియుడు షిజు పదునైన ఆయుదంతో ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. కట్ చేస్తే.. 7 ఏళ్ల తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. గురువారం షిజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు షిజును ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోవడంతో షిజు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.