2018లో కేరళలో అన్నం, కూర దొంగిలాంచాడని ఓ ఆదివాసి వ్యక్తిని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపిన విషయం తెలిసిందే. వీరి దాడిలో ఆ అమాయక యువకుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనపై కోర్టు తాజాగా నిందితులకు శిక్ష విధించింది.
2018లో కేరళలో అన్నం, కూర దొంగిలాంచాడని ఓ ఆదివాసి వ్యక్తిని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే. వీరి దాడిలో ఆ అమాయక యువకుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మా కొడుకుని అన్యాయంగా కొట్టి చంపారని మృతుడి తల్లి గుండెలు పగిలేలా రోదించింది. ఇక ఈ కేసు కోర్టు వరకు వెళ్లడంతో అప్పుడే ఓ వ్యక్తికి జైలు శిక్ష విధించింది.
మరో విషయం ఏంటంటే? ఇదే కేసును విచారణ చేపట్టిన కేరళలోని స్పెషల్ కోర్టు బుధవారం సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో మిగిలిన 13 మంది నిందితులకు కూడా ఏడళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది. అంతేకాకుండా దోషులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించింది. దీంతో పాటు జరిమానాలో సగం మృతుడి తల్లికి ఇవ్వాలని కూడా తెలిపింది. కోర్టు తీర్పుతో మృతుడి తల్లి, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అన్నం, కూర దొంగిలాంచాడనే కారణంతో అమాయక ఆదివాసిని కొట్టి చంపిన ఈ ఘటనలో కోర్టు తాజా తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.