యువతి, యువకుడు ఎవరూ ఊహించిన పాడు పనికి శ్రీకారం చుట్టారు. పోలీసుల కళ్లు గప్పి ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎందుకు అనుమానం వచ్చిన పోలీసులు వారు వెళ్తున్నలగ్జరీ బస్సును తనిఖీ చేయగా గలీజ్ దందా బట్టబయలైంది. అసలేం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి యువకుడు ఎవరూ ఊహించిన పాడు పనికి శ్రీకారం చుట్టారు. పోలీసుల కళ్లు గప్పి గత కొంత కాలం నుంచి ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తునట్లుగా తెలుస్తుంది. అయితే ఎందుకో అనుమానం వచ్చి పోలీసులు వారు వెళ్తున్న లగ్జరీ బస్సును తనిఖీ చేయగా గలీజ్ దందా బట్టబయలైంది. ఈ ఘటనతో బిత్తరపోయిన పోలీసులు అనంతరం వారిని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు పోలీసులు ఆ యువతి, యువకుడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కేరళ తిరువనంతపురం పరిధిలోని చుల్లిమనూరుకు చెందిన వినీషా (29), కవడియార్ కు చెందిన వరుణ్ బాబు (24) స్నేహితులు. వీరికి గత కొంత కాలం నుంచే పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే ఇద్దరూ ఏదైనా చేసి డబ్బులు కూడబెట్టాలని అనుకున్నారు. ఇందులో భాగంగా వీరికి ఓ ఆలోచన తట్టింది. అదే అక్రమంగా హైబ్రిడ్ థాయిలాండ్ గంజాయిని తరలించడం. ఇక అనుకున్నదే ఆలస్యం ఆ యువతి, యువకుడు ఆ దిశగా చకచకలు పనులు స్టార్ చేసి బిజెనెస్ కూడా మొదలు పెట్టారు. అలా పోలీసుల కళ్లు గప్పి వీళ్లు గత కొంత కాలంగా గంజాయి సరఫరా కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే ఇటీవల వీళ్లిద్దరూ ఓ లగ్జరీ బస్సులో బెంగుళూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్నారు. దీంతో ఎందుకో అనుమానం వచ్చిన యాంటీ నార్కోటిక్స్ బృందం.. బస్సును పరుశువాకల్ వద్ద ఆపి తనిఖీలు నిర్వహించింది. ఇక వినీషా, వరుణ్ బాబు దగ్గర ఉన్న ప్లాస్టిక్ కవర్ బ్యాగును పరిశీలించగా.. అందులో ఏకంగా 15 గ్రాముల హైబ్రిడ్ థాయిలాండ్ గంజాయి కనిపించింది. దీనిని చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇంత పెద్దమొత్తంలో సరఫరా చేస్తున్న వినీషా, వరుణ్ బాబులను యాంటీ నార్కోటిక్స్ బృందం అరెస్ట్ చేసింది.