యువకుడికి ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునే వరకూ వెళ్లింది. దీంతో కొన్నాళ్లపాటు ఇద్దరు మాట్లాడుకున్నారు. అయితే ఓ రోజు సెడెన్ గా ఫోన్ చేసి మా ఇంట్లో ఎవరూ లేరు రా అంటూ యువతి ఫోన్ నెంబర్ తో మెసెజ్ చేసింది. దీంతో మనోడు అత్రుతగా పరుగు పరుగున వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా ఓ వ్యక్తి దర్శనమిచ్చాడు. దీంతో ఆ యువకుడు షాక్ కు గురయ్యాడు.
ఇది కూడా చదవండి: మహిళా వాలంటీర్ కు లైంగిక వేధింపులు.. సర్పంచ్ భర్త కీచకపర్వం!
ఆ వ్యక్తి ఎవరో కాదు ఆ యువతి భర్త. రమ్మని మెసెజ్ చేసింది కూడా అతేనేనట. దీంతో మనోడి ఫ్యూజులు ఒక్కసారిగా అవుటయ్యాయి. ఇక ఆ యువకుడిని చేతులు, కాళ్లు కట్టేసి ఆ మహిళ భర్త డబ్బులు డిమాండ్ చేశాడు. లక్షడబ్బు, ఓ కారు ఇస్తే వదిలేస్తానని చెప్పాడు. నా దగ్గర అంత డబ్బులేదని, ప్రస్తుతం రూ.10 వేలు మాత్రమే ఉన్నాయని వేడుకున్నాడు. అయినా అతడు వెనక్కి తగ్గలేదు. దీంతో ఆ మహిళ భర్త నుంచి తప్పించుకుని బాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పరారీలో ఉన్న ఆ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.