మృత్యువు ఎప్పుడు..ఎవరిని కాటేస్తుందో ఎవరూ చెప్పలేరు.. అప్పటివరకు అందరితో కలిసిమెలిసి తిరిగినవారు ఉన్నట్టుండి మృత్యువాత పడుతూ ఇంటిళ్లిపాదిని శోకసంద్రంలోకి నెట్టేస్తుంటారు. ఆ కోవకు చెందిందే ఈ కథనం. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరికి బయలుదేరిన వారిని దారి మధ్యలోనే మృత్యువు బలి తీసుకుంది.
మృత్యువు ఎప్పుడు..ఎఆవరిని కాటేస్తుందో అంతుపట్టడం అసాధ్యం. అప్పటివరకు అందరితో కలిసిమెలిసి తిరిగినవారు ఉన్నట్టుండి మృత్యువాత పడుతూ ఇంటిళ్లిపాదిని శోకసంద్రంలోకి నెట్టేస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ కథనం. చెన్నై నుంచి సొంతూరికి కుటుంబ సభ్యులతో బయలుదేరిన వారిని దారి మధ్యలోనే మృత్యువు బలి తీసుకుంది. కారు టైరు పగిలి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి సమీపంలో చోటుచేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలులోని నిర్మలనగర్‌కు చెందిన బొర్రా ప్రవీణ్ చెన్నైలోని మ్యాండో ఆటోమోటివ్ ఇండస్ట్రీలో పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. వీరి కుటుంబం కూడా అక్కడే ఉంటోంది. నాలుగు రోజుల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టుకున్న ప్రవీణ్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సాయంత్రం చెన్నై నుంచి ఒంగోలుకు కారులో బయలుదేరారు. మరో గంటలో ఇంటికి చేరుతారు అనుకుంటుండగా వారిని మృత్యువు కాటేసింది.
శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కావలి సమీపంలోని మద్దూరుపాడు వద్ద ముందు టైరు పగిలిపోవడంతో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి దాని పక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవీణ్, ఆయన కుమారుడికి తీవ్ర గాయాలవ్వగా.. ప్రవీణ్ భార్య ప్రియాంక, అత్త భారతి (52) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అతి కష్టం మీద కారు తలుపులు తెరచి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం గాయపడిన వారిని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో వారి సొంతూరిలో విషాధచాయలు అలుముకున్నాయి.