అప్పటి వరకు మన కళ్ల ముందు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు అనుకోని కారణాలతో చనిపోతే తల్లిదండ్రులు ఎంతగా ఆవేదనకు గురి అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ చిన్నారి అప్పటి వరకు అందరితో సంతోషంగా గడిపింది. అంతలోనే చాక్లెట్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలో బిజూర్ గ్రామానికి చెందిచిన చిన్నారి సమన్వి దగ్గరలోని వివేకానంద పాఠశాలలో ఫస్ట్ క్లాస్ చదువుతుంది. బుధవారం స్కూల్ కి వెళ్లనని మారాం చేయడంతో తల్లిదండ్రులు బుజ్జగించి ఒక చాక్లెట్ ఇచ్చి స్కూల్ కి పంపించే ప్రయత్నం చేశారు. ఆ పాప చాక్లెట్ నోట్లో వేసుకున్న సమయానికే స్కూల్ బస్ రావడంతో హడావుడిగా చాక్లెట్ మింగేసింది. అంతే ఒక్కసారే డోర్ వద్ద కుప్పకూలింది.
అప్పటి వరకు తమ ముందు ఎంతో చలాకీగా ఆడుకుంటున్న తమ కూతురు ఒక్కసారే కుప్పకూలిపోవడంతో హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆ చిన్నారి అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి హటత్తుగా చనిపోవడం తో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసుల బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలిక ఎలా మరణించింది అనే విషయం నివేదిక వచ్చాకే తెలుస్తాయని పోలీసులు చెప్పారు.