చేసేది తప్పని తెలుసు.. కానీ ఆమెకు అందులోనే థ్రిల్ కనిపించింది. జీవితం అంటే బొమ్మలాట అనుకుంది.. సమాజం, కట్టుబాట్లు అన్నింటిని వదిలేసింది. దీనికి తోడు సినిమాల ప్రభావం ఆమెపై అధికంగా ఉంది. తన చుట్టూ ఎంత మంది మగాళ్లు తిరిగితే అంత గొప్ప అని భావించింది. దానికి తగ్గట్టే కాలేజీ రోజుల్లో 15 మంది బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చింది. సరే ఒంటరిగా ఉంటూ ఆమెకు నచ్చినట్లు బతికితే ఎవ్వరు ఏమి అనరు. కానీ పెళ్లి చేసుకుంది.. ఆ తర్వాత అయినా బుద్ధి మార్చుకుందా అంటే అది లేదు. పెళ్లి తర్వాత కూడా ప్రేమాయాణం నడిపింది. ఈ విషయం భర్తకు తెలియడంతో.. అతడు అడ్డు చెప్పాడు. దాంతో భర్తను తమ దారి నుంచి తొలగించుకోవాలని భావించింది. ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ చేసి భర్తను హత్య చేసింది. తర్వాత అమాయకంగా నటించే ప్రయత్నం చేసింది కానీ.. పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. ఆ వివరాలు..
కొన్ని రోజుల క్రితం యలహంక కొండప్పలేఔట్‌లోని ఓ ఇంటి మేడపై వ్యక్తి హత్యకు గురయిన సంగతి సంచలనం సృష్టించింది. నిందితులు అత్యంత దారుణంగా అతడిని హతమార్చారు. ఇక మృతి చెందిన వ్యక్తిది సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఇక దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన దాని ప్రకారం.. చంద్రశేఖర్‌కి కొన్నాళ్ల క్రితం శ్వేతతో వివాహం జరిగింది. ఇక శ్వేతకు కాలేజీలో చదివే రోజుల్లోనే చాలా మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. ఆమె బెంగుళూరులో ఎంసీఏ చదివే రోజుల్లో.. చాలా మంది యువకులతో డేటింగ్ చేసింది. ఎక్కువ మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉండటం చాలా గొప్ప విషయంగా భావించింది.
ఈ క్రమంలో సుమారు 15 మంది బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చింది శ్వేత. వారితో కొన్ని రోజుల పాటు సరదాగా తిరగడం.. ఎంజాయ్ చేయడం.. ఆ తర్వాత వారి నంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టడం చేసేది. ఇక ఎంసీఏ చేస్తున్న సమయంలో శ్వేత బెంగళూరులో ఓ ఇంట్లో అద్దెకుండేది. ఈ క్రమంలో ఇంటి ఓనర్ కుమారుడితో కూడా చనువుగా మెలిగేది. అతడి బైక్‌పై కాలేజీకి వెళ్లడం, షికార్లకు వెళ్లడం చేసింది. ఈ క్రమంలో ఆమెకు సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. అతడిని ప్రేమిస్తూనే.. చంద్రశేఖర్‌ని పెళ్లి చేసుకుంది.
వివాహం తర్వాత కూడా ప్రియుడు సురేశ్‌తో రిలేషన్ కొనసాగించింది. ఈ విషయం కాస్త భర్త చంద్రశేఖర్‌కు తెలియడంతో.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పద్దతి మార్చుకోమని హెచ్చరించాడు. దీనిపై ఇద్దరు తరచుగా గొడవపడేవారు. ఈ క్రమంలో తమకు అడ్డు వస్తున్న భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది శ్వేత. ప్రియుడు సురేశ్‌తో కలిసి.. చంద్రశేఖర్ హత్యకు ప్లాన్ చేసింది. దానిలో భాగంగా.. అక్టోబర్ 22న ప్రియుడు సురేష్‌ని ఇంటికి పిలిపించింది. అతడిని మేడ మీదకు పంపింది. ఆ తర్వాత భర్త చంద్రశేఖర్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాడు.
ఈ క్రమంలో శ్వేత.. ఇంట్లో నీళ్లు రావడం లేదని.. మేడ మీదకు వెళ్లి.. ట్యాంకు వద్ద చూడాలని చెప్పింది. భార్య మాట విని మేడ మీదకు వెళ్లాడు చంద్రశేఖర్. అప్పటికే అక్కడ కాచుకుని ఉన్న సురేశ్ చంద్రశేఖర్‌పై దాడి చేశాడు. రాడ్‌తో అతడి తలపై కొట్టి.. ప్రైవేట్ భాగాలపై దాడి చేసి.. కత్తిరించి.. అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ప్రియుడు వెళ్లిన తర్వాత శ్వేత నాటకం ప్రారంభించింది. తన భర్తను ఎవరో హత్య చేశారంటూ వెక్కివెక్కి ఏడ్చింది. కానీ పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. తమ స్టైల్లో విచారణ చేయగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం పోలీసులు శ్వేత, ఆమె ప్రియుడు సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.