నమ్మి వచ్చిన భార్యను దారుణంగా మోసం చేశాడో భర్త. అతడి చేసిన వంచనను తట్టుకోలేక దారుణ నిర్ణయం తీసుకుంది భార్య. ఆ వివరాలు..
నేటి కాలంలో సమాజంలో చోటు చేసుకుంటున్న నేరాల్లో ఎక్కువశాతం వాటికి వివాహేతర సంబంధాలే కారణమవుతున్నాయి. కట్టుకున్న వారిని వదిలి.. క్షణకాల సుఖాల కోసం తమ జీవితాలనే కాక.. తమతో పాటు ఉన్న వారి జీవితాలను, ఆఖరికి వారి కడుపున పుట్టిన వారి జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. వారి సుఖం కోసం బిడ్డల భవిష్యత్తును చిదిమేస్తున్నారు. ప్రేమించిన భాగస్వామిని మోసం చేయడమే కాక.. తమ బంధానికి అడ్డుగా ఉన్నారంటే.. హత్య చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇక తాజాగా ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రాణంగా ప్రేమించే భార్యను కాదని.. పక్క చూపులు చూశాడు ఓ భర్త. వివాహతేర సంబంధం మాత్రమే కాక భర్త ప్రియురాలు గర్భవతి కూడా కావడంతో.. జరిగిన మోసాన్ని తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆ వివారు..
భర్త వివాహేతర సంబందంతో విసిగిపోయిన వివాహిత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఓ వివాహిత మహిళ. కర్ణాటక తిరువళ్లూరు జిల్లా ఒండికుప్పం గ్రామానికి చెందిన ప్రసాద్(28)కు పడపై ప్రాంతానికి చెందిన సమీప బంధువైన భవాని(24)తో 2019లో పెళ్లి అయింది. వీరికి ఏడాదిన్నర బాబు వున్నాడు. ప్రసాద్ శ్రీపెరంబదూరులోని ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి అదే కంపెనీలో పనిచేసే కవిత అనే యువతితో పరిచయం ఏర్పడటమే కాక.. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. ఇలాంటి విషయాలు ఎంతో కాలం దాగవు కదా. ప్రసాద్ వ్యవహారం.. అతడి భార్య భవానికి తెలిసిందే. దాంతో ఈ విషయమై భార్యాభర్తలు గొడవపడి సంవత్సరం నుంచి వేరుగా వుంటున్నారు.
రెండు వారాల క్రితం భవానీకి ఫోన్ చేసిన కవిత, తనకు ప్రసాద్‌కు మూడు నెలల క్రితం వివాహమైందని, తాను ప్రస్తుతం మూడు నెలల గర్భవతినని చెప్పింది. విషయం విన్న వెంటనే భవానీ షాక్‌కు గురయ్యింది. దీని గురించి భర్తను నిలదీయగా.. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. తప్పు చేయడమే కాక.. అది నేరమే కాదన్నట్లు మాట్లాడిన భర్త మాటలు భవానిని కుంగదీశాయి. భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్థాపానికి గురైన భవాని సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై భవాని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను అరెస్టు చేశారు. భవాని మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.