ఎంతో ఘనంగా కుమార్తె పెళ్లి చేసిన తల్లిదండ్రులు.. బిడ్డ భవిష్యత్తు గురించి బంగారు కలలు కన్నారు. కానీ పెళ్లైన నెలకే ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇంతకు ఏం జరిగింది అంటే..
పైన ఫొటోలో చక్కగా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తోన్న ఈ మహిళ పేరు శోభ. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. తమకు ఉన్నంతలో బిడ్డకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. చక్కగా చదివించారు. మంచి సంబంధం చూసి.. అంగరంగ వైభవంగా వివాహం చేశారు. అత్తింట్లో తన బిడ్డ.. భర్తతో కలిసి నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆశించారు. అయితే వారి ఆశలన్ని అడియాసలు అయ్యాయి. బంధుమిత్రుల ఆశీర్వాదాలతో.. తల్లిదండ్రుల దీవెనలతో.. ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన నెల రోజుల్లోనే ఆ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిండు నూరేళ్లు పిల్లా పాపాలతో సంతోషంగా బతకాల్సిన ఆమె.. పెళ్లైన నెలకే మృతి చెందింది. కారణం..
ఈ విషాదకర సంఘటన కర్ణాటక, కుశాల వద్ద చోటు చేసుకుంది. సిగె హోసూరుకు చెందిన గణేష్‌కు శోభ అనే కుమార్తె ఉంది. 36 రోజుల క్రితమే ఆమెకు వివాహం అయ్యింది. అరకలగూడు తాలూకాలోని ఇబ్బడి గ్రామానికి చెందిన నవీన్‌తో శోభ వివాహం జరిగింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన దంపతులు.. తమ భవిష్యత్తు గురించి బంగారు కలలు కన్నారు. జీవితం ఎలా ఉండాలో ప్రణాళికలు రచించుకున్నారు. భవిష్యత్తు, పిల్లల గురించి అనేక ఆలోచనలు చేశారు. అయితే దురృష్టం కొద్ది అవి కార్యరూపం దాల్చే అవకాశం లేకుండా పోయింది. నవ వధువు శోభ మృతి చెందింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
నూతన దంపతులిద్దరూ కలిసి సోమవారం అరకలగూడు నుంచి హొళె నరసిపురకు బైక్ మీద వెళ్తున్నారు. ఇంతలో వీరి వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ.. బైక్‌ని ఢీకొట్టింది. వారిద్దరూ కింద పడగా.. లారీ వారి మీద నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో శోభ తీవ్ర గాయాల పాలై.. అక్కడికక్కడే కన్ను మూసింది. ఇక శోభ భర్త నవీన్‌కు రెండు కాళ్లు విరిగాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లైన నెల రోజులకే కుమార్తె ఇలా మృత్యువాత పడటంతో.. ఆ తల్లిదండ్రులు గుండెలె పగిలేలా ఏడుస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.