సోషల్ మీడియాలో పరిచయాలు, ప్రేమలు, పెళ్లిళ్లు చాలానే చూశాం. స్మార్ట్ ఫోన్లు వాడకం ఎక్కువయ్యాక.. సోషల్ మీడియాలో పరిచయాల కంటే ప్రేమ ముసుగులో మోసాలే ఎక్కువగా జరుగుతున్నాయి. చాటింగ్, మీటింగ్, డేటింగ్ అంటూ లక్షలు, కొందరైతే కోట్లు కూడా కొట్టేస్తున్నారు. ఎన్నిచోట్ల ఇలాంటి మోసాలు వెలుగుచూస్తున్నా.. ఎంత మంది మోసపోతున్నారు అని తెలుస్తున్నా.. ప్రజల్లో మార్పు రావడం లేదు. తాజాగా వెలుగు చూసిన ఓ ఫేస్ బుక్ మోసం మరోసారి ప్రజలను అలర్ట్ చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం నిప్పాణి తాలూకా నాయిగ్లాజ్ గ్రామానికి చెందిన మహంతేశ ముడసె అనే యువకుడు సోషల్ మీడియాలో మోసాలకు ప్రాల్పడుతున్నాడు. దుబాయి లో ఉండే బెళగావికి చెందిన యువతి ఫొటో సేకరించి స్నేహ పేరుతో ఫేస్ బుక్ ఖాతా తెరిచాడు. అక్కడితో ఆగకుండా దాదాపు 50 మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. వారితో తరచూ ఆడ గొంతుతో ఫోన్లో మాట్లాడటం ప్రారంభించాడు.
అలా ఎంతో మందిని స్నేహ పేరుతో వలలో వేసుకున్నాడు. వారి నుంచి దాదాపు రూ.19 లక్షలు దోచుకున్నాడు. అంతా బాగానే సాగిపోతున్న దుబాయి లో ఉండే యువతి తన ఫొటోని ఫేస్ బుక్ చూసింది. తన పేరిట ఒక నకిలీ ఖాతా ఉన్నట్లు గుర్తించింది. వెంటనే ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా పోలీసులు నిందితుడు మహంతేశను అరెస్ట్ చేశారు. మహంతేశ చేసిన మోసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.