వాళ్లిద్దరూ స్నేహితులు. ఒకే చోట ఫ్లవర్ డెకరేషన్ పని చేస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత వీరిలో ఓ యువకుడు ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కట్ చేస్తే తాను ప్రేమించిన అమ్మాయినే తన స్నేహితుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువకుడు తట్టుకోలేక నీచానికి దిగాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు తాను ప్రేమించిన యువతిని తన స్నేహితుడే ఎలా పెళ్లి చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్న విషయం ప్రేమించిన యువకుడు తెలిశాక ఏం చేశాడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాకటలోని బయ్యప్పనహళ్లి ప్రాంతం. ఇక్కడే సతీష్, రాకేష్ అనే ఇద్దరు యువకులు స్థానికంగా ప్లవర్ డెకరేషన్ పని చేస్తున్నారు. కొన్నాళ్ల పాటు కలిసి ఇదే పని చేయడంతో ఇద్దరు కాస్త స్నేహితులుగా మారిపోయారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఈ క్రమంలోనే రాకేష్ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అలా ఆ యువతి మాయలో పడ్డ ఆ యువకుడు ప్రేమ విహారంలో తేలియాడుతున్నాడు. కట్ చేస్తే రాకేష్ ప్రేమిస్తున్న యువతినే అతని స్నేహితుడైన సతీష్ రాకేష్ కు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాకేష్ కోపంతో రగిలిపోయాడు.
అసలు నేను ప్రేమించిన యువతిని వీడు పెళ్లి చేసుకోవడం ఏంటని తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఈ క్రమంలోనే రాకేష్.. స్నేహితుడైన సతీష్ ను దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా.. అతడిని హత్య చేసింది అతని స్నేహితుడేనని తేలింది. అనంతరం పోలీసులు రాకేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. సతీష్ తాను ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకున్నాడని, ఈ కోపంతోనే సతీష్ ను హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.