చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే వారిని సరైన మార్గాల్లోకి తీసుకెళ్లేందుకు మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఇక కోపం వస్తే తిడతాం, కాదంటే కొడతాం. కానీ కర్ణాటకలోని ఓ అంగన్ వాడీ టీచర్ మాత్రం సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించింది. బాలుడు తరుచు ప్యాంట్ లో మూత్ర విసర్జన చేస్తుండడంతో కోపంతో అతని ప్రైవేట్ పార్ట్స్ ని కాల్చి వాతపెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని తమకూరు జిల్లాలోని ఓ ప్రాంతంలో ఓ మహిళ అంగన్ వాడీ టీచర్ గా పని చేస్తుంది. అయితే ఇదే అంగన్ వాడీకి స్థానికంగా ఉండే ఓ బాలుడు రోజూ వస్తున్నాడు. అయితే ఆ బాలుడు అప్పుడప్పుడు తనకు తెలియకుండానే ప్యాంట్ లోనే మూత్ర విసర్జన చేసుకుంటున్నాడు. అంగన్ వాడీలోనే ఆ బాలుడు అలా తరుచు చేస్తుండడంతో ఆ టీచర్ విసిగిపోయింది. అనేక సార్లు మందలించి చెప్పి చూసినా కూడా ఆ బాలుడు అలాగే మూత్ర విసర్జన చేస్తున్నాడు. దీంతో కోపంతో విర్రవీగిన ఆ అంగన్ వాడీ టీచర్ ఆ బాలుడి ప్రైవేట్ పార్ట్స్ ను కాల్చి వాత పెట్టింది.
దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడు ఏడుస్తూ ఇంటికి వెళ్లాడు. ఏం జరిగిందని ఆ బాలుడి తల్లిదండ్రులు ప్రశ్నించగా.. జరిగిందంతా వివరించాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు వెంటనే తమ కుమారుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆ తల్లిదండ్రులు జరిగిన దారుణంపై ఉన్నతాధికారులకు వివరించారు. దీనిపై స్పందించిన అధికారులు అంగన్ వాడీ టీచర్, సహాయకులకు నోటీసులు జారీ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. బాలుడు ప్యాంట్ లో మూత్ర విసర్జన చేస్తున్నాడని అతడి ప్రైవేట్ పార్ట్స్ కు కాల్చి వాతలు పెట్టిన అంగన్ వాడీ టీచర్ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.