వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలనుకున్నారు. భవిష్యత్ జీవితం కోసం ఎన్నో కలల కన్నారు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఎలాగైన పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రేమ విహారంలో తేలియాడుతూ ఎంజాయ్ చేస్తున్న క్రమంలోనే వీరి లవ్ స్టోరీ ఊహించని మలుపుకు తిరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా బేవినమట్టి గ్రామం.
ఇక్కడే నివాసం ఉంటున్న విశ్వనాథ్ (24), రాజేశ్వరి (18) గత నాలుగు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎలాగైన పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. దీంతో వీరి ప్రేమ విషయం ఇరువురి తల్లిదండ్రులకు చెప్పారు. విశ్వనాథ్ తల్లిదండ్రులు కుమారుడి పెళ్లికి అంగీకరించినా.., రాజేశ్వరి తల్లిదండ్రులు మాత్రం అంగీకరించలేదు. దీంతో వీరి పెళ్లి విషయమై గ్రామస్తుల సమక్షంలో చర్చలు కూడా జరిపారు. కానీ ఇక్కడే రాజేశ్వరి తండ్రి కోపంతో ఊగిపోతున్నాడు. కూతురి చేసిన పనితో గ్రామంలో నా పరువు పోయిందని తనలో తాను కుమిలిపోతున్నాడు. ఇక ఎలాగైన రాజేశ్వరి, విశ్వనాథ్ ను చంపాలనే ప్లాన్ గీశాడు. ఇందులో భాగంగానే కొందరి యువకుల సాయాన్ని తీసుకున్నాడు. ఇందు కోసం వారి హత్యకు అవసరమైన పథకం రచించి యువకులకు వివరించాడు.
ఇక పక్కా ప్లాన్ ప్రకారమే కదిలిన ఆ యువకులు రాజేశ్వరి, విశ్వనాథ్ ను నమ్మించి.., మీ ఇద్దరితో మాట్లాడాలని ఓ చోటకు రమ్మన్నారు. వారి మాటని నమ్మిన వాళ్లిద్దరూ వారు చెప్పిన చోటకు వెళ్లారు. ఇక వెళ్లగానే ముందే ప్లాన్ తో ఉన్న యువకులు రాజేశ్వరి, విశ్వనాథ్ రాగానే వారిని దారుణంగా హత్య చేశారు. అనంతరం వారి శవాలను కనిపించకుండా ఉండేందుకు స్థానికంగా ఉండే నదిలో పడేశారు. ఇక సాయంత్రం అయినా విశ్వనాథ్ ఇంటికి రాకపోవడంతో అతని తల్లి ఖంగారుపడింది. అతని జాడ కోసం తల్లి అటూ ఇటూ అంతటా వెతికింది. కానీ ఎక్కడ కూడా విశ్వనాథ్ ఆచూకి కనిపించలేదు. పక్కా ప్లాన్ తోనే నా కుమారుడిని కిడ్నాప్ చేశారంటూ విశ్వనాథ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనలో కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి విచారణ చేపట్టారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటనలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.