ఈమె పేరు జయ శ్రీ. చూడటానికి ఏం తెలియనట్టుగా కనిపిస్తున్నా.. ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. అమాయక యువకుడిని ఆసరాగా చేసుకుని నడి రోడ్డుపై కిరాతకానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు జయ శ్రీ , వయసు 40 ఏళ్లు. మద్యానికి బానిసైన ఈ మహిళ.. తరుచు మద్యం సేవిస్తుండేది. దీంతో పాటు స్థానికంగా ఉండే వ్యక్తులతో ఆమె వివాహేతర సంబంధాలు కూడా నడిపేదని తెలుస్తుంది. అయితే ఇటీవల ఆ మహిళ బెల్గాంలోని ఓ ప్రాంతంలో ఫుల్ గా మద్యం సేవించిన అటూ ఇటూ తిరిగింది. ఈ క్రమంలోనే ఓ అమాయక యువకుడిని పట్టుకుంది. అతనితో మెల్లగా మాటలు కలిపింది. ఏం జరుగుతుందో తెలియని ఆ యువకుడు.. ఆమె చేసిన పనికి షాక్ గురయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక బెళగావి పరిధిలోని తారిహాల్ గ్రామంలో నాగరాజ్ రాగి పాటిల్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతని తల్లి చిన్నప్పుడే మరణించడంతో పాటు తండ్రి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. అయితే ఉపాధి నిమిత్తం నాగరాజ్ గతంలో మహారాష్ట్ర వెళ్లాడు. ఇటీవలే తిరిగి తన సొంతూరుకు వచ్చాడు. ఇదిలా ఉంటే తన ఊరిలో త్వరలో జాతర ఉంది. దీని కోసం కొత్త బట్టలు తెచ్చుకోవడానికి బెల్గాం వెళ్లాడు. అటు నుంచి నాగరాజ్ వెళ్తుండగా జయశ్రీ అనే మహిళ అతని వద్దకి వచ్చి ఫోన్ ఇవ్వాలని కోరింది. నా ఫోన్ ఎందుకు ఇవ్వాలని సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ నాగరాజ్ తో గొడవ పెట్టుకుంది.
ఇక మద్యం మత్తులో ఉన్న ఆ మహిళ అందరూ చూస్తుండగానే తన వద్ద ఉన్న కత్తితో నాగరాజ్ ను అతి దారుణంగా పొడిచింది. ఈ దాడిలో ఆ యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో నాగరాజ్ రాగి పాటిల్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం స్థానికులు ఆ మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో అమాయక యువకుడి ప్రాణం తీసిన మహిళ కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.