ఆమె పేరు ఆయేషా. గత కొన్నేళ్ల నుంచి ఓ యువకుడిని ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కట్ చేస్తే.. ఉన్నట్టుండి ఆ యువతి పోలీస్ స్టేషన్ లోనే సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనతో పోలీసులతో పాటు ఆమె ప్రియుడు, తల్లిదండ్రులు షాక్ గురయ్యారు.
ఆ అమ్మాయికి చదువుకునే రోజుల్లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమాయాణం నెలల నుంచి ఏళ్లు గడిచింది. ఇక చివరికి ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇదిలా ఉంటే ఆ యువతి ఇటీవల తన ప్రియుడికి వెళ్లి వారి ఇంట్లోనే నివాసం ఉంటుంది. కట్ చేస్తే.. ఆ యువతి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఇక పోలీసుల ముందే ఆ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆయేషా, బళ్లారికి చెందిన భీమేష్ వీరిద్దరూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. దీంతో ఇద్దరూ బెంగుళూరులో చదువుకునే వారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహం కాస్త చివరికి ప్రేమగా మారడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. అప్పటి నుంచి వీరి ప్రేమాయణం కొనసాగుతూ వస్తుంది. సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. చివరికి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఇద్దరి కులాలు వేరు కావడంతో ప్రియుడు ప్రియురాలితో పెళ్లికి నిరాకరించాడు.
దీంతో ప్రియురాలు ఆయేషా.. నా ప్రియుడు నాపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భీమేష్ ను అరెస్ట్ చేయడంతో పాటు 3 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఇక తర్వాత మనసు మార్చుకున్న ఆయేషా.. నా ప్రియుడు నాపై అత్యాచారం చేయలేదని కోర్టులో ఒప్పుకుంది. దీంతో భీమేష్ జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత నుంచి ఆయేషా, భీమేష్ బాగానే ఉన్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచయి ఆయేషా ప్రియుడు భీమేష్ ఇంట్లోనే ఉంటుంది. అయితే ఇటీవల ఆయేషా, భీమేష్ ఇద్దరూ మరోసారి గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.
తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి.. నా చావుకి నేనే కారణం అంటూ స్థానిక పోలీస్ స్టేషన్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే పోలీసుల ముందే ఆ యువతి బలవన్మరణానికి పాల్పడడంతో పోలీసులు, స్థానికులు షాక్ గురయ్యారు. అనంతరం పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత ఆయేషా మృతదేహాన్ని యువతి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.