ఈ మధ్యకాలంలోని యువతులు పెళ్లికన్న ముందే మరొకరిని ప్రేమిస్తూ ఇష్టం లేకున్నా తల్లిదండ్రుల కోరిక మేరకు మరొకరితో పెళ్లికి ఒప్పుకుంటున్నారు. ఇక చేసుకున్నోడితోనైన ఉంటున్నారా అంటే అదీ లేదు. కొందరైతే తెల్లారే పెళ్లి పెట్టుకుని ప్రేమించినోడితో పారిపోవడమో లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం.
అచ్చం ఇలాంటి ఘటనలోనే తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఓ వధువు ప్రియుడితో పారిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గౌరిబిదనూరు పరిధిలోని నాగరెడ్డి కాలనీకి చెందిన వెన్నెల(22), అప్పిరెడ్డిహళ్లికి చెందిన తన ప్రియుడు, మేనమామ అయిన ప్రవీణ్ (25) తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: నా భార్య కంట్లో కారంపోసి కొడుతోంది.. ప్లీజ్ కాపాడండంటూ పోలీసులను వేడుకున్న భర్త!
అలా కొంత కాలం వీరి ప్రేమ వ్యవహారం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇదిలా ఉంటే ఆ యవతి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని భావించి కరేకల్లహళ్లివాసి సురేశ్‌తో పెళ్లికి ముహూర్తం కుదుర్చుకున్నారు. ఇంట్లో అంతా పెళ్లి హడావుడి. బంధువులంతా ఇంటికి చేరుకుని పెళ్లి పనుల్లో బిజీగా మారిపోయారు. ఇక తెల్లారితో పెళ్లి.. కట్ చేస్తే వధువు గుట్టు చప్పుడు కాకుండా తన ప్రియుడు ప్రవీణ్ తో పరారైంది.
ఈ విషయం తెలుసుకున్న వరుడు, వధువు బంధువులు అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వధువు ఇచ్చిన షాక్ తో అందరికీ దిమ్మతిరిగిపోయింది. ఈ విషయం మాకు ముందే చెప్పి ప్రియుడితోనే పెళ్లి చేసేవాళ్లం కదా అంటూ యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.