వివాహేతర సంబంధాలు.. ఇవే నేటి కాలంలో సాఫీగా సాగిపోతున్న పచ్చని కాపురాలను నిట్టనిలువునా చీల్చుతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త ఇలా బరితెగించి ఎవరికి వారు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతూ చివరికి హత్యలు లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక ఇదే కాకుండా వీరి అక్రమ సంబంధాల వ్యవహారం తోడబుట్టిన వాళ్లకి తెలియడంతో వారిని అంతమందించేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత తన తమ్ముడిని ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కర్ణాటకలోని హుబ్బళి నగరం సమీపంలోని నూల్కి గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన శంభులింగ (35) అనే వ్యక్తికి నరసమ్మ అనే మహిళతో వివాహం జరిపించారు. వీరికి పెళ్లై సుమారుగా 18 ఏళ్లు అవుతోంది. నరసమ్మ భర్తతో కాపురం కొంత కాలం బాగానే చేసింది. కానీ రోజులు గడిచే కొద్ది ఆమె బుద్ది వక్రమార్గంలోకి అడుగులు వేసింది. ఇక కట్టుకున్న మొగుడిని కాదని పరాయి వాడితో కలిసి వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ వచ్చింది.
ఇది కూడా చదవండి: Nalgonda: మొగుడికన్న ప్రియుడే ఎక్కవనుకుంది.. పరువు తీసిందని ఉరేసి హత్య చేసిన భర్త!
అయితే ఇదే విషయం భర్తకు తెలిసినా పరువు పోతుందని తెలియనట్టుగా నటించాడు. కానీ నరసమ్మ వ్యవహారం చివరికి తొడబుట్టిన తమ్ముడికి తెలిసింది. దీంతో నరసమ్మ తమ్ముడు ఒక్కసారిగా కోపంతో రగిలిపోయాడు. ఇదే విషయంపై అక్కను పలుమార్లు హెచ్చరించి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నరసమ్మ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక మరో విషయం ఏంటంటే? తన చీకటి కాపురం తమ్ముడికి తెలిసిందని అక్క తట్టుకోలేక పోయింది. దీంతో ఎలాగైన తమ్ముడిని హత్య చేయాలనే ఆలోచనకు వచ్చింది.
ఇక అనుకున్నట్లుగానే ఆమె ప్రియుడి సాయంతో కలిసి తమ్ముడిని నడి రోడ్డుపై హత్య చేయించింది. తర్వాత ఏం తెలియదన్నట్టుగా నా తమ్ముడిని ఎవరో హత్య చేశారంటూ వాపోయింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్క తీరుపై అనుమానమొచ్చింది. దీంతో గట్టిగా విచారించే సరికి నరసమ్మ నేనే హత్య చేశానంటూ ఒప్పుకుంది. ఇక నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.