వివాహేతర సంబంధాలు.. ఇవే నేటి కాలంలో సాఫీగా సాగిపోతున్న పచ్చని కాపురాలను నిట్టనిలువునా చీల్చుతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త ఇలా బరితెగించి ఎవరికి వారు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతూ చివరికి హత్యలు లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని దొడ్డ తాలూకా వడగెరె గ్రామం. ఇదే గ్రామానికి చెందిన చన్నబసవయ్య, భాగ్యశ్రీ ఇద్దరు భార్యాభర్తలు. చాలా ఏళ్ల కిందటే వీరికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉంది. అయితే బసవయ్య భార్య భాగ్యలక్ష్మికి ఇదే గ్రామానికి చెందిన రియాజ్ అనే వ్యక్తితో భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ ఉంది. దీంతో ఇద్దరు ఆర్థికలావాదేవీలు కూడా జరిపారు. ఇదే విషయంపై ఇద్దరికి గతంలో గొడవలు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఇద్దరి మధ్య కొంత కాలం కాస్త గ్యాప్ కూడా వచ్చింది.
ఇది కూడా చదవండి: karnataka: ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య!
దీంతో రియాజ్ భాగ్యలక్ష్మిపై పగ పెంచుకున్నాడు. అయితే శనివారం రోజున భర్త ఏదో పని మీద పక్క ఊరికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నాడు. ఇక ఆదివారం తెల్లవారు జామున ఓ వ్యక్తి భాగ్యలక్ష్మి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్లిన అనంతరం ఇంటి తలుపులు కొట్టాడు. తలుపులు తీయగానే కత్తితో భాగ్యలక్ష్మిని ఇద్దరు పిల్లల ముందే దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భాగ్యలక్ష్మిని ఆస్పత్రి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఆమె అప్పటికే ప్రాణాలు విడిచింది.
ఈ విషయం భర్తకు తెలిసే ప్రయత్నం చేసినా ఫోన్ స్విచ్చాఫ్ రావడం విశేషం. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి మీద అనుమానం వ్యక్తం చేస్తుండగా ప్రియుడు రియాజ్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి భాగ్యలక్ష్మి హత్య కేసులో ప్రియుడు రియాజ్ పాత్ర ఉందా? లేదంటే మరెవరైన హస్తం ఉందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.