కర్నాటకలోని బెళగావి కాంగ్రెస్ నాయకురాలు, సామాజిక కార్యకర్త నవ్య శ్రీ రావు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హార్టికల్చర్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రాజకుమార టాకళె నా భర్తే అని, గతంలో మాకు పెళ్లి కూడా జరిగిందని అంటోంది నవ్య శ్రీ. కానీ ఇప్పుడు మాత్రం ఆయన తానెవరో తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని, దానికి సంబంధించిన ఎన్నో సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయని నవ్యశ్రీ గతంలోనే అనేక సార్లు పెదవి విప్పింది.
ఇక ఈమె వాదని ఇలా ఉంటే నవ్యశ్రీ కావాలనే నన్ను బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుందని, నా వద్దకు సాయం కోసం వచ్చినప్పుడు హెల్ప్ చేశానని, అప్పటి నుంచి డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ కు దిగుతుందని రాజకుమార టాకళె వాపోతున్నారు. అయితే నవ్యశ్రీ తాజాగా ఇదే అంశం గురించి మీడియాతో మాట్లాడుతూ..టాకళె నన్ను 2020లో బెంగళూరులో కుమారకృపా గెస్ట్ హౌస్ వెనుకనున్న గణేశ్ ఆలయంలో పెళ్లి చేసుకున్నారని, అతనే నా భర్త అని చెప్పింది.
ఇది కూడా చదవండి: ఈమె అందం చుట్టూ ఊహించని రచ్చ! ఆ వీడియోస్ బయటకి!
దీంతో నాకు అతడి వల్ల నాకు అన్యాయం జరిగింది, నేను గతంలో టాకళెపై బెళగావి మహిళా పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు చేశాను. ఇక గతంలోనే పెళ్లి చేసుకుని మొదటి భార్య ఉండగానే నన్ను కిడ్నాప్ చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని వాపోయింది. ఇలా నన్ను మోసం చేయడానికి కొందరి రాజకీయ నాయకుల హస్తం కూడా ఉన్నట్లు నవ్యశ్రీ వివరించింది. ఇక ఇంతటితో ఆగకుండా ఏకాంతంగా ఉన్న సమయంలో అశ్లీల వీడియో తీసి ఓ వెబ్‌సైట్‌కు అమ్మాడని, దాని వల్ల సమాజంలో నా పరువు కూడా పోయేలా చేశాడని రాజకుమార టాకళెపై నవ్యశ్రీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఇక ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారంగా రేగుతోంది. సామాజిక కార్యకర్త నవ్య శ్రీ రావు వ్యాఖల్యలపై మీ అభిప్రాయాను కామెంట్ రూపంలో తెలియజేయండి.