నేటి కాలం యువతి యువకులు చిన్న చిన్న సమస్యలకే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు. చివరికి తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చి వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోట్ల రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అచ్చం ఇలాగే కర్ణాటకలోని ఓ యువతి సైన్స్ సబ్జెక్ట్ నచ్చడం లేదని ఆత్మహత్య చేసుకుంది. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. వియాపుర జిల్లా లింగసుగూర్ పరిధిలోని కోమలాపురం గ్రామంలో పద్మావతి (17) అనే బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది.
పద్మావతి నాగబెట్టలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. కూతురు రోజు కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండడంతో బాగానే చదువుకుంటుందని తల్లిదండ్రులు అనుకున్నారు. ఇదిలా ఉంటే పద్మావతికి సైన్స్ సబ్జెక్ట్ అంటే అస్సలే నచ్చదట. రోజు క్లాస్ రూమ్ లో టీచర్స్ చెప్పే ఆ సైన్స్ పాఠాలు అర్థమై అర్థం కాక తీవ్ర గందరగోళానికి గురయ్యేది. పద్మావతి రోజు రోజుకు ఆ ఒత్తిడిని మాత్రం తట్టుకోలేకపోయింది. ఈ సమయంలోనే ఆ బాలిక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగానే ఆ బాలిక.. క్షమించండి. నాకు సైన్స్ సబ్జెక్ట్ నచ్చదు, అందుకే చనిపోతున్నా అంటూ సూసైడ్ నోట్ లో రాసుకొచ్చింది. అనంతరం ఇంట్లో బాత్ రూంలోకి వెళ్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కొన్ని గంటల తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులు బాత్రూం తలుపులు తెరిచి చూడగా.. కూతురు ఉరికి వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ ను చూసిన పద్మావతి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కూతురిని ఆ స్థితిలో చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు.
స్థానికులు అంతా చేరి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత బాలిక రాసిన సూసైడ్ నోట్ చదివి మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.