తుకారం-శాంతకుమారి దంపతులు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా కాపురాన్ని ఈడ్చుకొచ్చారు. కానీ, ఇటీవల భార్యపై అనుమానంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు.
వివాహేతర సంబంధాల కారణంగా రోజుకొకరు ఆత్మహత్య చేసుకోవడం లేదంటే హత్య చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు ఈ మధ్యకాలంలో చాలానే జరుగుతున్నాయి. అయితే అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భర్త.. భార్యపై అనుమానంతో దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలు ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తుకారం, శాంతకుమారి భార్యాభర్తలు. కర్ణాటక కారావార్ జిల్లా హలియాల పరిధిలోని ఓ గ్రామంలో నివాసం ఉంటున్న ఈ దంపతులకు చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల సంసార జీవితం బాగానే కొనసాగింది. అలా కొంతకాలం పాటు ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. కానీ, రాను రాను భర్త భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు. నీకు పరాయి మగాళ్లతో సంబంధాలు ఉన్నాయని తరుచు భార్యతో గొడవకు దిగేవాడు. అయితే ఇదే విషయంపై ఈ నెల 22వ తేదిన రాత్రి భర్త భార్యతో గొడవకు దిగాడు.
ఈ నేపథ్యంలోనే భార్యాభర్తలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన భర్త.. భార్య శాంతకుమారిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం భర్త భార్య శవాన్ని ఇంట్లో ఉన్న నీటి డ్రమ్ములో ముంచాడు. ఆ తర్వాత తుకారం అదే డ్రమ్మును వాహనంలోకి ఎక్కించి స్థానికంగా ఉన్న ఓ అటవి ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక.. అతడు భార్య శాంతకుమారి మృతదేహాన్ని ఆ నీటి డ్రమ్ములోంచి బయటకు తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అక్కడున్న కొందరు గమనించి ఏం జరిగిందంటూ అతడిని ప్రశ్నించారు.
అంతే కాకుండా వాళ్లంతా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించి నిందితులైన భర్త తుకారంతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అనుమానంతో భార్యను హత్య చేసిన ఈ కిరాతకుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.