సొణ్ణేగౌడ, నేత్రావతి ఇద్దరు దంపతులు. వీరికి గతంలో పెళ్లై ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. దీంతో వారి కాపురం ఎంతో సంతోషంగా సాగిపోతున్న క్రమంలోనే భర్త ఉన్మాదిలా మారి కిరాతకానికి పాల్పడ్డాడు.
భార్యకు పరాయి మగాడితో సంబంధం ఉందన్న అనుమానంతో ఓ భర్త ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. అతడు ఉన్మాదిలా మారి.. చివరికి కూతుళ్లతో పాటు భార్యను అతి దారుణంగా ప్రాణాలు తీశాడు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అది కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా శిడ్లఘట్ట పరిధిలోని హెణ్ణూరు గ్రామం. ఇక్కడే సొణ్ణేగౌడ (48), నేత్రావతి (37) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి స్నేహ (11), హర్షిణి (9) కూతుళ్లు జన్మించారు. భార్యాభర్తలు స్థానికంగా వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అలా అప్పటి వరకు వీరి జీవితం ఎంతో సంతోషంగా సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు.
భార్యకు మరొక మగాడితో వివాహేతర సంబంధాన్ని అంటగట్టి అనుమానించాడు. ఇక ఇంతటితో ఆగకుండా.. భార్య నేత్రావతిని తరుచు వేధింపులకు గురి చేసేవాడు. ఇకపోతే భర్త సొణ్ణేగౌడ మంగళవారం భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. దీంతో భార్యాభర్తలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే భర్త క్షణికావేశంలో ఊగిపోయి కిరాతకానికి పాల్పడ్డాడు. భార్యా, ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. దీంతో మంటల్లో కాలి ఆ ముగ్గురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
అనంతరం సొణ్ణేగౌడ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఆ తర్వాత పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో సొణ్ణేగౌడ భార్యాపిల్లలను చంపి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.