అది 2023 ఫిబ్రవరి 3. ఆ రోజు రాత్రి ఆ దంపతులు తిని నిద్రపోయారు. కట్ చేస్తే.. అర్ద రాత్రి భర్తకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడుతూ కంగారుగా భర్త బయటకు వెళ్ళాడు. కానీ, మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. అసలేం జరిగిందంటే?
హర్షిత, మంజునాథ్ దంపతులు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ భార్యాభర్తల కాపురం సంతోషంగానే సాగింది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 3వ రాత్రి దంపతులు నిద్రపోయారు, కానీ, అర్థరాత్రి సమయంలో మంజునాథ్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడిన మంజునాథ్ వెంటనే బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన అతడు.. మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
కర్ణాటక తుముకూరు జిల్లా కుణిగల్ పరిధిలోని సీనప్పనహళ్లి గ్రామం. ఇక్కడే మంజునాథ్, హర్షిత (20) భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. కానీ, కొన్ని రోజులు గడిచిన తర్వాత.. హర్షిత తన పిన్ని కుమారుడైన రఘుతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అలా భర్తకు తెలియకుండా ఆ మహిళ.. ప్రియుడైన రఘుతో ఎంజాయ్ చేస్తూ భర్తను దూరం పెట్టింది.
ఇక ప్రియుడిపై మోజు పడ్డ హర్షిత.. ఎలాగైన భర్తను పైలోకానికి పంపి ప్రియుడికి దగ్గరావ్వాలనుకుంది. అందుకోసం ఈ కిలాడీ లేడి ఓ మాస్టర్ ప్లాన్ సిద్దం చేసింది. అదేంటంటే..? భర్తను హత్య చేసేందుకు హర్షిత సుఫారీ కింద రౌడీలకు రూ.5 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. భర్త హత్యలో భాగంగా.. ఫిబ్రవరి 3న రాత్రి మంజునాథ్, హర్షిత నిద్రపోయారు. కట్ చేస్తే అర్థరాత్రి హర్షిత ప్రియుడు రఘు, అతని స్నేహితుడైన రవి కిరణ్ లు మంజునాథ్ కు ఫోన్ చేసి ఓ చోటుకు అర్జెంట్ గా రమ్మన్నారు.
వారి మాటలను నమ్మిన మంజునాథ్.. వెంటనే వారు పిలిచిన చోటుకు వెళ్లాడు. ఇక అక్కడికి వెళ్లగానే హర్షిత ప్రియుడు రఘు, అతడి స్నేహితుడు రవికిరణ్ లు ఇద్దరు కలిసి మంజునాథ్ ను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అతడి శవం కనిపించకుండా ఉండేందుకు పక్కనే ఉన్న ఓ చెరువులో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఉదయం చెరువులో శవం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహం మంజునాథ్ గా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత పోలీసులు అతని భార్య హర్షితను విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఇక పోలీసుల స్టైల్ లో విచారించగా.. హర్షిత అసలు గుట్టు విప్పింది. ప్రియుడితో ఉండేందుకే నా భర్తను సుఫారీ కింద రూ.5 లక్షలు ఇచ్చి హత్య చేయించానని తెలిపింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన హర్షిత, ఆమె ప్రియుడు రఘు, అతని స్నేహితుడు రవికిరణ్ లను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మరింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.